Udhayanidhi Stalin : విజయవాడకు తాకిన సెగ.. ఉదయ నిధిని చెప్పుతో కొడితే 10 లక్షలు
తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ సనాతన ధర్మం పట్ల చేసిన అణుచిత వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా లేదు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై రచ్చ కొనసాగుతూనే ఉంది.

Banners against Udaya Nidhi Stalin in Vijayawada
తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్(Udayanidhi Stalin) సనాతన ధర్మం(Sanatan Dharma) పట్ల చేసిన అణుచిత వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా లేదు. దేశవ్యాప్తంగా ఈ అంశంపై రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సెగ విజయవాడకు కూడా తాకింది. ఉదయ నిధిని ఎవరైనా చెప్పుతో కొడితే పది లక్షల రూపాయలు బహుమతి(10 Lakhs Prize)గా ఇస్తామంటూ విజయవాడ(Vijayawada)లో బ్యానర్లు(Banners) ఏర్పాటు చేశారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బలుపెక్కి మాట్లాడిన ఉదయ నిధి స్టాలిన్(Stalin) ను చెప్పుతో కొట్టిన వారికి పది లక్షల బహుమతి ఇవ్వబడును అని జన జాగరణ సమితి(Jana Jagarana Samithi) ప్లెక్సీ(Flexis)లు ఏర్పాటు చేసింది.
