ఎన్నికల ఫలితాల(ELection Results) కారణంగా సోషల్ మీడియాలో(Social media) రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. వెక్కిరింతలు, వేళాకోలాలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పటి హాస్యనటుడు, ప్రస్తుత నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) సినీ నటి రోజాను(RK Roja) ఉద్దేశించి ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టాడు.

Bandla Ganesh
ఎన్నికల ఫలితాల(ELection Results) కారణంగా సోషల్ మీడియాలో(Social media) రకరకాల పోస్టులు కనిపిస్తున్నాయి. వెక్కిరింతలు, వేళాకోలాలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పటి హాస్యనటుడు, ప్రస్తుత నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) సినీ నటి రోజాను(RK Roja) ఉద్దేశించి ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లోని నగరి అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బరిలో దిగిన రోజా ఓడిపోయారు. ఓటమికి చేరువలో ఉన్నప్పుడే ఆమె తన అనుచరులతో కలిసి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే బండ్ల గణేశ్ ఓ పోస్ట్ పెట్టారు. జబర్దస్త్ పిలుస్తోంది రా.. కదలిరా..@RojaSelvamaniRK అంటూ ఓ టెక్ట్స్ పెట్టి రోజా డాన్స్ ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తలో రకంగా కామెంట్ చేస్తున్నారు.
