Basavatarakam Cancer Hospital : బాలయ్య బసవతారకం హాస్పిటల్ ముందు బండ్లన్న అన్నదానం, వైరల్ వీడియో
బాలయ్య(Balakrishna) బాబు నిర్వహిస్తున్న బసవతారకం హాస్పిటల్ ముందు పేదలకు అన్నదానంచేశారు సంచలనాల నటుడు బండ్లగణేష్. సతీ సమేతంగా ఈ కార్యక్రమం నిర్వ హించాడు..ఇంతకీ విశేషం ఏంటంటే..?

Basavatarakam Cancer Hospital
బాలయ్య(Balakrishna) బాబు నిర్వహిస్తున్న బసవతారకం హాస్పిటల్ ముందు పేదలకు అన్నదానంచేశారు సంచలనాల నటుడు బండ్లగణేష్. సతీ సమేతంగా ఈ కార్యక్రమం నిర్వ హించాడు..ఇంతకీ విశేషం ఏంటంటే..?
బండ్ల గణేష్(Bandla Ganesh) సినిమా నటుడిగా కంటే.. కాంట్రవర్సీల కామెంట్లతో ఎప్పుడూ వైరల్ అవుతుంటాడు. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేసి.. ట్రెండింగ్ లో ఉంటారు. నటుడిగా, నిర్మాతగా కంటే .. తన కంట్రవర్సీయల్ కామెంట్స్ తో ఎక్కువగా వైరల్ అవుతుంటాడు బండ్ల. తన స్పీచ్ లతో, ఇంటర్వ్యూలతో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న బండ్ల గణేష్ ట్విట్టర్లో కూడా అదే సంచలనాల జోరు చూపిస్తుంటాడు.
ఓ పక్క పొలిటికల్ పోస్టులు షేర్ చేస్తూనే సినిమా పోస్టులు కూడా షేర్ చేస్తారు. ఆసక్తికర పోస్టులు పెడుతూ ఉంటారు. ప్రస్తుతానికి బండ్ల అన్నింటికి దూరంగా ఉంటూ.. తన పని తాను చేసుకుంటున్నాడు. ఇక తాజాగా మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. పేదలకు అన్నదానం నిర్వహించారు. హైదరాబాద్ లోనిబాలకృష్ణ(Balakrishna)కు చెందిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్(Basavatarakam Cancer Hospital) ముందు బండ్ల గణేష్ తన భార్య, మరికొంతమందితో కలిసి అన్నదానం(Alms Giving) నిర్వహించారు.
ఈ క్రమంలోనే వినాయకచవితి సందర్భంగా బండ్లగణేష్ అక్కడ ఉన్నవాళ్ళకి అన్నదానం చేశారు. ఆయనే స్వయంగా వడ్డించారు. ఈ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఇలా అన్నదానం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నేను నా భార్యతోకలిసి ఈ అన్న ప్రసాదం కార్యక్రమంలో పాల్గోనడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది అని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తో పాటు.. అన్నదానం వీడియో వైరల్ అవుతోంది.
