Bandla Ganesh : అన్నం కూడా తినబుద్ధి కావడం లేదు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) అవినీతి జరిగిందనే ఆరోపణలతో జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) మద్దతు పలికారు. ఆయనను ప్రశంసించారు.

Bandla Ganesh
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development Case) అవినీతి జరిగిందనే ఆరోపణలతో జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు(Chandrababu Naidu) సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్(Bandla Ganesh) మద్దతు పలికారు. ఆయనను ప్రశంసించారు. తెలుగు జాతి సంపద చంద్రబాబు అని అభివర్ణించారు. చంద్రబాబును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీదా ఉందన్నారు. చంద్రబాబు మళ్లీ గెలవడం ఖాయమని, ముఖ్యమంత్రి అయి తీరతారని బండ్ల గణేశ్ జోస్యం చెప్పారు. చంద్రబాబు రాజమండ్రి జైలులో మగ్గుతుంటే తనకు అన్నం కూడా తినబుద్ధి కావడం లేదని బండ్ల అన్నారు. పనిలో పనిగా ఐటీ ఉద్యోగులకు చిన్నపాటి సూచన కూడా చేశారాయన! పార్కుల ముందు, రోడ్డపై ధర్నాలు చేస్తే ఏమీ కాదని, సొంతూళ్లకు వెళ్లి బొడ్రాయి ముందు కూర్చొని ధర్నాలు చేయాలని చెప్పారు. ఓ నెల రోజుల పాటు ఉద్యోగాలకు సెలవు పెట్టి సొంతూళ్లకు వెళ్లి ధర్నాలు చేయాలంటూ బండ్ల గణేశ్ సూచించారు.
