బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈ రోజు విజయవాడ పర్యటనకు వెళ్లనున్నారు. కాసేపట్లో ఆయన విజయవాడకు బయలుదేరనున్నారు.

Bandi Sanjay who is going to AP tour today
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) ఈ రోజు విజయవాడ(Vijayawada) పర్యటనకు వెళ్లనున్నారు. కాసేపట్లో ఆయన విజయవాడకు బయలుదేరనున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయం(Shamshabad Rajiv Gandhi Airport) నుండి బండి సంజయ్ గన్నవరం(Gannavaram) వెళ్తారు. ఉదయం 9.30 గంటలకు గన్నవరం నుండి ఇంద్రకీలాద్రి(Indrakiladri) చేరుకుంటారు. అమ్మవారి దర్శనం అనంతరం నేరుగా బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ చేతన్ అభియాన్(Voter Chetan Abhiyan) కార్యక్రమంలో పాల్గొని సమీక్షిస్తారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్(Hyderabad) చేరుకుంటారు.
