అతి త్వరలో కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం

బీజేపీలో(BJP) బీఆర్ఎస్(BRS) విలీనమవుతుందని, అందులో భాగంగానే కవితకు బెయిల్(Kavitha bail) రాబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy) అన్నారు కదా! బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ మాత్రం కాంగ్రెస్‌లోనే(Congress) బీఆర్‌ఎస్‌ విలీనమవుతుందంటున్నారు. కవితకు బెయిల్ ఇవ్వాలా వద్దా అన్నది న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశమని, కవిత బెయిల్‌కు, బీజేపీకి ఏమిటి సంబంధం అని సంజయ్‌ ప్రశ్నించారు. బీజేపీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ(Aam Admi Party) విలీనమవుతేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా? అని సంజయ్‌ ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ది ముగిసిన అధ్యాయమని, ప్రజలు ఛీకొట్టిన పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బీజేపీకి పట్టలేదన్నారు. బీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్‌ తహతహలాడుతున్నదని, పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ చేర్చుకుంటున్నదని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. అతి త్వరలోనే కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనమవడం తథ్యమని, . కేసీఆర్‌కు ఏఐసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌కు పీసీసీ చీఫ్, హరీష్ రావుకు మంత్రి పదవి, కవితకు రాజ్యసభ పదవులు ఖాయమని చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story