Balineni Vs Riyaz : ఆ జిల్లా జనసేనలో ఆధిపత్య పోరు..!
ఆ జిల్లా జనసేనలో వర్గపోరు ముదురుతోంది. రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతోందట.

ఆ జిల్లా జనసేనలో వర్గపోరు ముదురుతోంది. రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే మండుతోందట. జిల్లా అధ్యక్షుడి, మాజీ మంత్రి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని సమాచారం. ఆ జిల్లాలో కీలకంగా ఉన్న నేత కాబట్టి ఆయనకు ఇస్తున్న గౌరవంతో జిల్లా అధ్యక్షుడి రుసరుసలాడుతున్నారని తెలుస్తోంది. ఇద్దరి నేతల మధ్య వైరం గాజు గ్లాసులో సెగలు రేపుతోంది. ఇంతకు ఏంటా జిల్లా.. ఎవరా నేతలు..!
ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అధ్యక్షుడు రియాజ్‌కు, ఈ మధ్యనే పార్టీలో చేరిన బాలినేని మధ్య దూరం పెరిగిపోయింది. ఇరు వర్గాల మధ్య పోరు తీవ్రమైంది. నిజానికి బాలినేని పార్టీలోకి రావడం రియాజ్‌కు ఇష్టం లేదట. బాలినేనిని పార్టీలోకి రాకుండా అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. బాలినేని పార్టీలోకి రావడం రియాజ్‌కు మింగుడు పడడం లేదు. పార్టీలో చేరినా నాటి నుంచి ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా ఉండిపోయారు. వాస్తవానికి జనసేన పార్టీ కోసం కష్టపడుతున్న వ్యక్తి రియాజ్. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు నమ్మిన బంటుగా ఉన్నారు. పవన్‌ను వైసీపీ నేతలు విమర్శిస్తే గట్టి కౌంటర్లు ఇచ్చేవారు. పార్టీ కోసం తొలి నుంచి పనిచేస్తున్న వ్యక్తి రియాజ్. దీంతో తన ఇలాఖాలోకి మరో నేత రావడం రియాజ్‌కు ఇష్టం లేదు. ఒంగోలు ఎమ్మెల్యేతో రియాజ్ క్లోజ్‌గా ఉంటారు. అయితే పార్టీ బలోపేతం చేయడాన్ని రియాజ్ పట్టించుకోలేదని కార్యకర్తల వాదన. ఈ నేపథ్యంలోనే 2024లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాలినేని జిల్లాలో కీలకంగా ఉన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన బాలినేనికి జిల్లాలో మంచి పట్టు ఉంది. జిల్లా వ్యాప్తంగా బాలినేనికి తన సొంత వర్గం ఉంది. నిజానికి బాలినేని వైసీపీని వీడడం జగన్‌కు మైనస్సే. అయితే ఆయన కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నారు. ఆయన అనుచరులు 19 మంది కార్పొరేటర్లు టీడీపీలో జాయినయ్యారు. బాలినేని అనుమతితోనే వారు టీడీపీలో చేరారని టాక్ వచ్చింది. జనసేనలో కొంత కాలం నుంచి సెలైంట్‌గా ఉన్న బాలినేని తన అనుచరులైన మరో 20 మంది కార్పొరేటర్లను తీసుకుళ్లి పవన్ సమక్షంలో పార్టీలో చేర్పించారు. ఈ కార్యక్రమానికి రియాజ్ వచ్చినా కానీ అంటీముట్టనట్లుగానే వ్వవహరిచారట. జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆయనుకు ఆహ్వానం ఇచ్చారు. దీంతో బాలినేని వర్గం యాక్టివ్ అయింది. పార్టీ పటిష్టత కోసం బాలినేని ఈ పనిచేశారని ఆయన వర్గం వాదించింది. బాలినేని యాక్టివ్ కావడంతో రియాజ్ వర్గం ఒకింత అసంతృప్తిగానే ఉందట. జిల్లాలో బాలినేని ఏకుమేకై కూర్చున్నారని భావిస్తున్నారట. జిల్లాలో ముందుముందు బాలినేని మరింత యాక్టివ్ అవుతాడని.. మరిన్ని చేరికలు జనసేనలో ఉంటాయని బాలినేని వర్గం చెప్తున్న మాట. ఈ కోల్ట్‌వార్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వేసే స్టెప్ ఏంటో మరి..!
