వచ్చే ఏపీ అసెంబ్లీ(AP assembly elections), సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తూ వెళ్తున్న సీఎం జగన్(CM Jagan).. మరో మాట లేకుండా నో చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని గంపెడాశలు పెట్టుకున్న నేతలు.. అధినేత నిర్ణయంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి వారిలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta srinivaulu reddy) ఒకరు. మాగుంట సీటు కోసం బాలినేని పట్టుబడుతున్నారు.

వచ్చే ఏపీ అసెంబ్లీ(AP assembly elections), సార్వత్రిక ఎన్నికలే టార్గెట్ గా వైసీపీ అభ్యర్ధులను ఖరారు చేస్తోంది. గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తూ వెళ్తున్న సీఎం జగన్(CM Jagan).. మరో మాట లేకుండా నో చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని గంపెడాశలు పెట్టుకున్న నేతలు.. అధినేత నిర్ణయంతో మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి వారిలో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి(Magunta srinivaulu reddy) ఒకరు. మాగుంట సీటు కోసం బాలినేని పట్టుబడుతున్నారు. అయితే..ఈసారి మాగుంటకు సీటు ఇచ్చేది లేదని బాలినేనికి(Balineni) తేల్చి చెప్పారు వైసీపీ(YCP) పెద్దలు. దీనితో మాగుంటకు సీటు లేకపోతే తనకు ఫోన్ చేయవద్దని వైసీపీ పెద్దలకు బాలినేని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. సీఎం జగన్ పిలిచినా రానని ఖరాఖండిగా చెప్పిన బాలినేని.. నిన్న సీఎంఓ కార్యాలయానికి వచ్చారు. అయితే.. సీఎం బిజీగా ఉన్నారని, కలిసే పరిస్థితి లేదని చెప్పడంతో వెనుతిరిగినట్టు తెలిసింది. ఈ రోజు బాలినేనికి సీఎంఓ నుంచి కబురు వచ్చింది. అక్కడే మాగుంట అంశాన్ని వైసీపీ పెద్దలు తేల్చి చెప్పినట్టు సమాచారం. ఒంగోలు ఇన్‌ఛార్జ్ గా చెవిరెడ్డిని(Chevi reddy) నియమిస్తున్నట్టు బాలినేనికి స్పష్టం చేశారని తెలుస్తోంది. దీనితో ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్ వ్యవహారంపై గత కొద్దిరోజులుగా వస్తున్న పలు ఊహాగానాలు తెరపడినట్టయ్యింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి పోటీ చేస్తున్నారని చెప్పిన వైసీపీ పెద్దలపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మాగుంటకు గనుక టికెట్ నిరాకరిస్తే తాను కూడా పోటీ చేయనని బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెగేసి చెప్పినట్టు తెలిసింది. మరోవైపు శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. అంతేకాదు.. మాగుంట కొడుకు రాఘవరెడ్డి కూడా తెలుగుదేశం తీర్ధం పుచ్చుకుంటారనే ప్రచారం ఉంది. శ్రీనివాసులు రెడ్డికి ఎప్పటిలాగే ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే.. ఆయన కొడుకుకి కావలి టికెట్ కేటాయిస్తారనే టాక్ వుంది. మాగుంట సీటు విషయంలో అధిష్టానం పై గుర్రుగా ఉన్న బాలినేని..ఆయనతోపాటే పార్టీ వీడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్న బాలినేని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.

Updated On 30 Jan 2024 8:17 AM GMT
Ehatv

Ehatv

Next Story