రాజశేఖర్ రెడ్డి నేర్పిన రాజకీయమే నేను చేస్తానని.. రానున్న ఎన్నికల్లో

తాను ఏదైనా చేయాలనుకుంటే పార్టీ బయటకు వెళ్లి చేస్తానే తప్ప.. పార్టీలో ఉండి ఏది చేయనని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తేల్చి చెప్పారు. వైఎస్సార్ తమకు ఒకటే నేర్పించాడని.. పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లి పాలు త్రాగి మోసం చేసినట్లేనని చెప్పాడన్నారు. ఇక సీఎం జగన్ రెండు వైపులా.. రెండు నియోజకవర్గాల్లో ఇద్దరు మంత్రులను పోటీలో పెట్టి తనకు పరీక్ష పెట్టారని తెలిపారు. మంత్రులిద్దరు గెలిస్తే బాగానే ఉంటుంది.. ఓడితే మాత్రం బాలినేని ఓడించాడు.. ఏదో ఫిట్టింగ్ పెట్టాడని అంటారన్నారు. రాజశేఖర్ రెడ్డి నేర్పిన రాజకీయమే నేను చేస్తానని.. రానున్న ఎన్నికల్లో మంత్రి సురేష్ ని గెలిపించాలని ఆయన కోరారు. తాను బయట ఒకటి, లోపల ఒకటి మాట్లాడనని అన్నారు. తన గుండెల నుంచి వచ్చే మాటలే మాట్లాడుతానని చెప్పారు. అందరూ కలసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్ నాయకత్వంలో అన్ని నియోజకవర్గాల్లో గెలవాలని ఆయన కోరారు.

ఇక ఒంగోలులో 231 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన 25 వేల మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంపై అధికారులతో మంత్రి బాలినేని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బాలినేని మండిపడ్డారు. పట్టాల పంపిణీలో అవినీతి జరిగినట్లు నిరూపిస్తే, తాను డబ్బులు తీసుకున్నట్లు తేలితే చెప్పుతో కొట్టాలంటూ భావోద్వేగానికి గురయ్యారు. పట్టాల పంపిణీ కోసం తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టానన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు యత్నిస్తే వారి ఆఫీసును వేలమంది లబ్ధిదారులతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 25లోపు సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు.

Updated On 11 Feb 2024 10:19 PM GMT
Yagnik

Yagnik

Next Story