TDP Janasena Alliance : రెండు పార్టీల మధ్య ఇగో క్లాష్! పొత్తు కొనసాగుతుందన్న నమ్మకం లేదు!
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradseh) జగన్మోహన్‌రెడ్డిని(Jagan Mohan Reddy) గద్దెదించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ(TDP), జనసేనలు(Janasena) తమ ఉమ్మడి శత్రువును ఓడించడానికి చేతులు కలిపాయి. పొత్తు పెట్టుకున్నాయి. నీ కిన్ని సీట్లు, నా కిన్ని సీట్లు అని లెక్కలేసుకుని ఆ విధంగా ముందుకుపోతున్నాయి. చంద్రబాబు(Chandrababu)-పవన్‌కల్యాణ్(Pawan kalyan) ఏదేదో అనుకున్నారు. పొత్తుతో ప్రత్యర్థి చిత్తుచిత్తు అవుతారని అంచనాలు వేసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ దృశ్యాలు కనిపించడం లేదు. పార్టీల నాయకులు, కార్యకర్తలు తలోదారిలో వెళుతున్నారు. పైగా ఆ రెండు పార్టీలాత్మీయ సమావేశాల్లో గల్లాలు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradseh) జగన్మోహన్‌రెడ్డిని(Jagan Mohan Reddy) గద్దెదించడమే ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ(TDP), జనసేనలు(Janasena) తమ ఉమ్మడి శత్రువును ఓడించడానికి చేతులు కలిపాయి. పొత్తు పెట్టుకున్నాయి. నీ కిన్ని సీట్లు, నా కిన్ని సీట్లు అని లెక్కలేసుకుని ఆ విధంగా ముందుకుపోతున్నాయి. చంద్రబాబు(Chandrababu)-పవన్‌కల్యాణ్(Pawan kalyan) ఏదేదో అనుకున్నారు. పొత్తుతో ప్రత్యర్థి చిత్తుచిత్తు అవుతారని అంచనాలు వేసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ దృశ్యాలు కనిపించడం లేదు. పార్టీల నాయకులు, కార్యకర్తలు తలోదారిలో వెళుతున్నారు. పైగా ఆ రెండు పార్టీలాత్మీయ సమావేశాల్లో గల్లాలు పట్టుకుని మరీ కొట్టుకుంటున్నారు. జనసేన పార్టీ నేతలంతా ఓ నమ్మకంతో ఉన్నారు. అదేమంటంటే జనసేన బలం, బలగం అంతా కాపు సామాజికవర్గమేనన్నది వారి విశ్వాసం. కానీ ఆ సామాజికవర్గం మొత్తం జనసేనకే ఓటు వేస్తుందన్న గ్యారంటీ ఏమీ లేదు. గత ఎన్నికల్లో ఇది రుజువయ్యింది కూడా! కాకపోతే గోదావరి(Godhavari) జిల్లాలలో మాత్రం జనసేన ప్రభావం అంతో ఇంతో ఉంటుంది. ఇది గమనించే జనసేనతో తెలుగుదేశంపార్టీ పొత్తు పెట్టుకుంది. ఇప్పుడు జనసేన-టీడీపీల మధ్య గట్టి పోటీ ఉన్న చోటల్లా గొడవలు జరుగుతున్నాయి. జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశాలలో చోటు చేసుకుంటున్న కొట్లాటలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. రానున్న రోజుల్లో ఈ గొడవలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే భవిష్యత్తులో రెండు పార్టీల మధ్య పొత్తు చిత్తయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. టీడీపీ నేతలంతా ఇష్టం ఉన్నా లేకపోయినా పవన్ కల్యాణ్ బొమ్మను ముద్రించిన జనసేన కండువాలను భుజాన వేసుకుని తిరుగుతున్నారు. రెండు పార్టీల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కానీ హార్డ్‌కోర్ నందమూరి అభిమానులకు(Nandhamuri fans) ఇది నచ్చడం లేదు. మొన్న హిందూపూర్‌లో పవన్ బొమ్మను ముద్రించిన కండువాను బాలకృష్ణ(Balakrishna) వేసుకోవడం ఫ్యాన్స్‌కు మింగుడుపడటం లేదు. రెండు పార్టీల ఉమ్మడి ఆత్మీయ సమావేశాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ కానీ, నాదెండ్ల మనోహర్ కానీ టీడీపీ కండువాలు వేసుకున్నట్టు లేదు. మరి బాలయ్య ఎందుకు కండువా వేసుకోవాల్సి వచ్చిందని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. పవన్ కంటే బాలయ్య చాలా సీనియర్. పవన్‌కు ఎంత క్రేజ్ ఉందో బాలకృష్ణకు అంతటి క్రేజ్ ఉంది. అంతటి బాలయ్యకు ఇలాంటి పరిస్థితి రావడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.