నట సింహం నందమూరి బాలయ్యకు ఇద్దరు గారాల కూతుర్లు.. సినిమా ప్రపంచంలో పుట్టిపెరిగిన వారిద్దరు ఇండస్ట్రీలోకి మాత్రం రాలేదు.

నట సింహం నందమూరి బాలయ్యకు ఇద్దరు గారాల కూతుర్లు.. సినిమా ప్రపంచంలో పుట్టిపెరిగిన వారిద్దరు ఇండస్ట్రీలోకి మాత్రం రాలేదు. అయితే పెద్ద కూతురు బ్రహ్మిణి మాత్రం బిజినెస్ ఉమెన్ గా సంచలనం సృష్టిస్తున్నారు. అయితే ఆమెకు ఇండస్ట్రీలో ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?

నందమూరి ఇంటి నుంచి నట వారసులు ఎంత మంది వచ్చినా.. బాలయ్యబాబు బిడ్డలు ఇద్దరు సినిమాలకు సబంధంతేకుండా పెరిగారు. అంతే కాదు ఆయన తనయుడు మోక్షజ్ఞ మాత్రం ఇప్పుడిప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. బాలయ్య బాబు నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి తన సొంత ఇమేజ్ తో ఎలా ఎదిగాడో అందరికి తెలిసిందే. అలాగే తన తనయుడిని కూడా పక్కా ప్లాన్ తో రంగంలోకి దింపబోతున్నాడు బాలయ్య.

ఇక కూతుర్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు బాలకృష్ణ. చదువు తరువాత వెంటనే మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాడు. పెద్ద కూతురు బ్రాహ్మణి. నారావారి కోడులు అయ్యింది. మంత్రి లోకేష్ భార్యగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలిగా ఆమె స్టార్ డమ్ అందరికి తెలుసు. అంతే కాదు ప్రస్తుతం నారావారి ఫ్యామిలీకి చెందిన హెరిటేజ్ బిజినెస్ను ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తంది. ఇక చిన్న కూతురు తేజస్వీని కూడా గీతం వారి కోడలుగా వెళ్ళింది. ఇక ఆమె భర్త భరత్ ప్రస్తుతం విశాఖ ఎంపీగా ఉన్నారు. .. ఇక రీసెంట్ గా బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారి.. తమ్ముడు మోక్షజ్ఞ మూవీని నిర్మిస్తుంది.

ఇక బ్రాహ్మణి విషయానికి వస్తే.. ఆమెతన తండ్రి సినిమాలు అన్నీ చూస్తుంది. కాని ఆమెకు టాలీవుడ్ లో చాలా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..? బాలయ్య మాత్రం కాదట.. మరి ఎన్టీఆర్ అనుకుంటున్నారా..? ఆయన కూడా కాదట. చిన్నతనం నుంచి బ్రహ్మణికి మెగాస్టార్ చిరంజీవి అంటే చాలాఅభిమానమట. చిరంజీవి సినిమాలు వదలకుండా చూస్తుందట. అంతే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు కూడా అంతే ఇష్టంగా చూస్తుందట. మెగా తండ్రీ కొడుకుల డాన్స్ అంటే కూడా బ్రహ్మణికి చాలా ఇష్టమని తెలుస్తోంది.

Updated On 24 Dec 2024 6:00 AM GMT
ehatv

ehatv

Next Story