MLA BalaKrishna : ముచ్చి మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు విదిల్చే స్వభావం జగన్‌ది
అభివృద్ధి, సంక్షేమానికి తెలుగుదేశం(TDP) పార్టీ అధినేత చంద్రబాబు(chandrababu) ఓ బ్రాండ్ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Balakrishna) అన్నారు. కక్ష సాధించడమే సీఎం జగన్(Jagan Mohan Reddy) లక్ష్యమని, ఎటువంటి ఆధారాలు లేకున్నా చంద్రబాబును అరెస్ట్(chandrababu Arrest) చేశారని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు.

MLA BalaKrishna
నేను వస్తున్నా..నేనే ముందుంటా
కక్ష సాధించడమే సీఎం జగన్ లక్ష్యం
జగన్ కు మనుషులేంటేనే అలర్జీ
ముచ్చి మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు విదిల్చే స్వభావం జగన్‌ది
టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసింది..ఇప్పుడూ అధిగమిస్తాం
ఓటమి తప్పదనే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు
టీడీపీ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదు
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ
అభివృద్ధి, సంక్షేమానికి తెలుగుదేశం(TDP) పార్టీ అధినేత చంద్రబాబు(chandrababu) ఓ బ్రాండ్ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(MLA Balakrishna) అన్నారు. కక్ష సాధించడమే సీఎం జగన్(Jagan Mohan Reddy) లక్ష్యమని, ఎటువంటి ఆధారాలు లేకున్నా చంద్రబాబును అరెస్ట్(chandrababu Arrest) చేశారని ఆయన ఆరోపించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాలకృష్ణ మాట్లాడారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే జగన్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో కొందరు ప్రాణాలు కోల్పోయారని ఆ కుటుంబాలను పరామర్శిస్తానని హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరికీ భయపడనక్కర్లేదన్నారు.
టీడీపీ(TDP) ఎన్నో సంక్షోభాలు చూసింది.. ఇప్పుడూ అధిగమిస్తాం : ‘‘నేను వస్తున్నా..నేనే ముందుంటా. స్వాతంత్ర్య సమరం మనం చూడలేదు. కానీ ఇప్పుడు ఆ స్ఫూర్తితో పోరాడాల్సి ఉంటుంది. జనం ఆలోచించాలి. ఇలాగే భయపడుతూ కూర్చొంటే ఏపీ సర్వ నాశనం అవుతుంది. సైనికుల్లా ప్రతి ఒక్కరూ తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆలోచించడం కాదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. జగన్ కు మనుషులేంటేనే అలర్జీ. ముచ్చి మూతి పెట్టుకుని ఎంగిలి మెతుకులు విదిల్చే స్వభావం జగన్‌ది. రూ.10 ఇచ్చి రూ. 100 గుంజుకునే స్వభావం వైసీపీది. హిందూపురంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధే మిగిలింది. ఇప్పుడు అభివృద్ధే లేదు. మాట తప్పని పార్టీ మాది. మాట తప్పకపోవడం అనేది ఎన్టీఆర్ నుంచి మా పార్టీకి వారసత్వంగా వచ్చింది. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటపడతారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసింది.. ఇప్పుడూ అధిగమిస్తాం. ఇప్పుడే కాదు, ఇంకా కేసులు పెడతారు. జగన్ లండన్ ఎందుకెళ్లారు? ఇవాళే జగన్ ఏపీకి వచ్చాడంట. ఈ హ్యాంగోవర్ దిగడానికి మరో పది రోజులు పడుతుందేమో..? అన్నారు.
ప్రజల పక్షాన పోరాడతాం. మన శక్తి యువత..వారిని స్ట్రీమ్ లైన్ చేయాలి. కానీ జగన్ ప్రభుత్వం గంజాయికి బానిసలుగా మార్చేస్తున్నారు. హిందూపురంలో ప్రభుత్వాస్పత్రిలో పందులు, పశువులు తిరుగుతున్నాయి. జగన్(Jagan) ఏపీని ప్రపంచ పటంలో లేకుండా చేశారు. అభూత కల్పనలు సృష్టించి చంద్రబాబుపై కేసు పెట్టారు. అభివృద్ధికి సంక్షేమానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. ఓటమి తథ్యమనే భయంతో జగన్ ఈ కేసులు పెట్టించినట్టు కన్పిస్తోంది. తాను 16 నెలలు జైల్లో ఉన్నాను కదా అని చంద్రబాబును 16 రోజులైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈ కేసును సృష్టించారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు సంబంధించి సీమెన్స్ సంస్థతో తొలి ఒప్పందం 2013లో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే ట్రైనింగ్ నిమిత్తం డిజైన్ టెక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ సాఫ్ట్ వేర్ సరఫరా చేస్తే డిజైన్ టెక్ శిక్షణ ఇచ్చింది. ప్రభుత్వ వాటా 10 శాతం. హిందూపురంలో మేమూ స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలో మేళా నిర్వహించాం. రాష్ట్రం మొత్తం మీద 2.13 లక్షల మంది ఆ రోజున తెలుగువారి ఆత్మాభిమానం కోసం ఎన్టీఆర్ పార్టీని పెట్టారు. చంద్రబాబు హయాంలో హైదరాబాద్ ఎంతో అభివృద్ధి జరిగింది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేశారు. దేశ వ్యాప్తంగా పార్టీలను ఏకం చేసిన ఘనత ఎన్టీఆర్‌ది. పార్టీలను ఏకం చేయడం అంటే దేశాన్నే ఐక్యం చేయడమేనని బాలకృష్ణ అన్నారు.
