ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ(Congress) పగ్గాలు ఎప్పుడైతే వై.ఎస్‌.షర్మిల(YS sharmila) చేతికి వచ్చాయో అప్పట్నుంచి ఆ పార్టీ జాతకమే మారిపోయిందని కొందరంటున్నారు. తెలంగాణలో ఆమె వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) పెట్టినప్పుడు కూడా ఇలాంటి మాటలే అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడం పక్కా అని, షర్మిల ముఖ్యమంత్రి కావడం ఇంకా పక్కా అని తమకు తోచిన జోస్యాలు చెప్పారు. తాను తెలంగాణ కోడలినని, ఇక్కడే పుట్టానని, ఇక్కడే తుది శ్వాస విడుస్తానని చెప్పిన షర్మిల ఇక్కడ బిచాణా ఎత్తేసి ఏపీలో అడుగుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ(Congress) పగ్గాలు ఎప్పుడైతే వై.ఎస్‌.షర్మిల(YS sharmila) చేతికి వచ్చాయో అప్పట్నుంచి ఆ పార్టీ జాతకమే మారిపోయిందని కొందరంటున్నారు. తెలంగాణలో ఆమె వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ(YSRTP) పెట్టినప్పుడు కూడా ఇలాంటి మాటలే అన్నారు. తెలంగాణలో అధికారంలోకి రావడం పక్కా అని, షర్మిల ముఖ్యమంత్రి కావడం ఇంకా పక్కా అని తమకు తోచిన జోస్యాలు చెప్పారు. తాను తెలంగాణ కోడలినని, ఇక్కడే పుట్టానని, ఇక్కడే తుది శ్వాస విడుస్తానని చెప్పిన షర్మిల ఇక్కడ బిచాణా ఎత్తేసి ఏపీలో అడుగుపెట్టారు. తెలంగాణలో ఎవరినీ వదలకుండా అందరిన్ని తిట్టేశారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని అక్కడి మట్టిపై ప్రమాణం చేసి మరీ చెప్పారు. ఏమైంది? ఆమె పోటీ చేయడం మాట యేసు ప్రభువు ఎరుగు.. కనీసం పార్టీ కూడా పోటీకి దూరంగా జరిగింది. కాంగ్రెస్‌ కోసం తాము పోటీ చేయడం లేదంటూ ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు షర్మిల. చివరికి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేసి ఏపీలో రాజకీయాలు మొదలుపెట్టారు. ఇప్పుడు అక్కడ కూడా అదే చేస్తున్నారు. అన్న జగన్మోహన్‌రెడ్డిపై(CM Jagan) తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

ప్రభుత్వం అసలు బాగోలేదంటున్నారు. అన్ని తిట్టు అన్ననే తిడితే జనాలకు అనుమానాలు వస్తాయని చంద్రబాబును కూడా రెండు మూడు మాటలు అంటున్నారు. అది కూడా పరుషపదజాలం ఉపయోగించకుండా సుతిమెత్తగా! పదే పదే నేను రాజశేఖర్‌రెడ్డి బిడ్డనని, పులిబిడ్డనని, ఎవరికీ భయపడేది లేదని చెబుతూ వస్తున్నారు. అంతగా ఆమెను ఎవరు భయపెట్టారని? అసలు షర్మిలను ఎవరు పట్టించుకుంటున్నారని? ఎవరికీ భయపడనని చెబుతూనే తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెప్పుకొస్తున్నారు షర్మిల. తెలుగుదేశంపార్టీ(TDP) అనుకూల మీడియాకు కూడా షర్మిల ప్రాణాలకు ముప్పు ఉన్నదంటూ తెగ ఫీలై పోతున్నది. చూడబోతే తెలుగుదేశంపార్టీనే షర్మిలకు ఏదైనా కీడు తలపెట్టి, ఆ నెపాన్ని జగన్ మీద తోసే పన్నాగమేదైనా చేస్తున్నదా అన్న డౌట్ తమకు వస్తున్నదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) అంటోంది. వైఎస్‌ వివేకానందరెడ్డి(YS Vivekanad murder) హత్య కేసును జగన్ మీదకు తోసేయడానికి తెలుగుదేశంపార్టీ, దాని అనుకూల మీడియా పడరానిపాట్లు పడిందని, అప్పుడు అలాంటి పనే చేసి జగన్‌పై నెట్టేస్తే జనం నమ్మేస్తారని టీడీపీ ప్లాన్‌ చేసిందని వైసీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వం దీన్ని తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని, దీనిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Updated On 1 Feb 2024 12:26 AM GMT
Ehatv

Ehatv

Next Story