ఏపీలో ఎన్నికలకు(AP elections 2024) సమయం దగ్గరపడింది. మరో రెండు నెలల్లోనే పార్టీల భవితవ్యం తేలిపోనుంది. రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. అయితే ఏపీ ఎన్నికలపై ఆత్మసాక్షి(Atmasakshi) నిర్వహించిన తాజా సర్వేలో(Survey) సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీ(TDP)-జనసేన(Janasena) కూటమి అధికారం చేపట్టనుందని ఆత్మసాక్షి చేపట్టిన సర్వే ఫలితాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 54 శాతం ఓట్లతో అధికారం చేపట్టనుందని ఈ సర్వే తేల్చి చెప్పింది.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ..రానున్న ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ భారీ టార్గెట్ పెట్టకుంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందుగానే అభ్యర్థుల మార్పులు చేర్పులపై కసరత్తు మొదలు పెట్టింది. ఈనేపథ్యంలో ఐదేళ్ల జగన్ పాలనపై ఆత్మసాక్షి సర్వే నిర్వహించింది. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..ప్రతిపక్ష టీడీపీదే పైచేయి అవుతుందని ఆ సర్వేలో తేలింది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం..ప్రస్తుతం అధికార వైసీపీ కంటే..టీడీపీకి 3 శాతం ఓట్లు పెరిగాయని సర్వేలో వెల్లడించింది. ఎన్నికల సమయానికి ఓటు శాతం మరింతపెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఆత్మసాక్షి సర్వే రెండు రకాలు చేసింది. ముందుగా వైసీపీ, టీడీపీ, జనసేన మూడు పార్టీలు.. వేర్వేరుగా పోటీ చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనేదానిపై సర్వే చేపట్టింది. మరోవైపు టీడీపీ, జనసేన కూటమిగా, టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీలు కూటమిగా పోటీ చేస్తే ఎలా ఉంటుందనేదానిపై అంశాల వారీగా సర్వే ఫలితాలను ప్రకటించింది. టీడీపీ, జనసేన వేర్వేరుగా పోటీ చేస్తే..టీడీపీ 86, వైసీపీకి 68, జనసేనకు 6 సీట్లు వస్తాయని వెల్లడించింది. 15 స్థానాల్లో గట్టిపోటీ ఉంటుందని స్పష్టం చేసింది. అందులో వైసీపీకి 9, టీడీపీ 6 సీట్లలో గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. జనసేన కూటమిగా పోటీ చేస్తే..టీడీపీకి 95 సీట్లు, జనసేనకు 13 సీట్లు వస్తాయని, అదే సమయంలో వైసీపీకి 60 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. 7 స్థానాల్లో పోటీ ఉంటుందని వెల్లడించింది. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే అదికారంలోకి రావడం ఖాయమని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేసింది. గత ఎన్నికల్లో వైసీపీ ఎవరూ ఊహించని విధంగా 151 సీట్లను కైవసం చేసుకుంది. 50 శాతం ఓట్లు వైసీపీకి రాగా..39 శాతం ఓట్లతో టీడీపీ 29 స్థానాలకే పరిమితమైంది. మొత్తానికి ఏపీలో టీడీపీదే విజయమని ఆత్మసాక్షి సర్వే చెబుతుండగా…టౌమ్స్ నౌ(Times Now) మాత్రం దీనికి విరుద్ధంగా సర్వే ఫలితాలను వెల్లడించింది. రానున్న ఎన్నికల్లో వైసీపీ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తుందని తన సర్వేలో ప్రకటించింది.

Updated On 26 Dec 2023 1:30 AM GMT
Ehatv

Ehatv

Next Story