Atchannaidu : వాలంటీర్ వ్యవస్థపై అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ప్రభుత్వం(YCP Govt) ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ(AP Volunteer System)పై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు వివాహేతర, అక్రమ సంబంధాలు కలిగినవారిని గుర్తిస్తున్నారని.. ఆ వివరాలను వైసీపీ నాయకులకు అందిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.

Atchannaidu
వైసీపీ ప్రభుత్వం(YCP Govt) ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ(AP Volunteer System)పై టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు వివాహేతర, అక్రమ సంబంధాలు కలిగినవారిని గుర్తిస్తున్నారని.. ఆ వివరాలను వైసీపీ నాయకులకు అందిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వివరాలతో వారిని వైసీపీ నాయకులు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
టీడీపీ చేపట్టిన భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమానికి వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ నాయకులకు భయం పట్టుకుందన్నారు. జగన్ రెడ్డి గ్యాంగ్.. వాలంటీర్ల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు మేము చేయడంలేదని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు మొన్నటివరకూ గడపగడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాల ద్వారా ప్రజలవద్దకు వెళ్లారని.. వైసీపీ నాయకులే ప్రజల ఇళ్లకు వెళ్లినా ప్రజలు పట్టించుకోలేదని.. అదే ప్రజలు తమ వద్దకు వచ్చి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్నారు. టీడీపీ చేపట్టిన భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంపై వైసీపీ నాయకుల తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
