ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను(YS Jagan) ఏషియన్‌ గేమ్స్‌లో(APN Games) పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో క‌లిశారు. సీఎంను క‌లిసిన‌వారిలో కోనేరు హంపి(Kooneru Hampi), బి.అనూష(B.Anusha), యర్రాజీ జ్యోతి(Yarraji Jyothi) త‌దిత‌రులు ఉన్నారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి, తాము సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను(YS Jagan) ఏషియన్‌ గేమ్స్‌లో(APN Games) పతకాలు సాధించిన ఏపీ క్రీడాకారులు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో క‌లిశారు. సీఎంను క‌లిసిన‌వారిలో కోనేరు హంపి(Kooneru Hampi), బి.అనూష(B.Anusha), యర్రాజీ జ్యోతి(Yarraji Jyothi) త‌దిత‌రులు ఉన్నారు. ఇటీవల చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన 19వ ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన కోనేరు హంపి, బి.అనూష, యర్రాజీ జ్యోతి, తాము సాధించిన పతకాలను సీఎం జగన్‌కు చూపారు. ఈ సంద‌ర్భంగా అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న ఏపీ క్రీడాకారులను సీఎం జగన్‌ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంద‌ని, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అనంత‌రం స్పోర్ట్స్‌ పాలసీ ప్రకారం క్రీడాకారులకు ఇచ్చే నగదు పురస్కారాన్ని విడుదల చేశారు.

1. మైనేని సాకేత్‌ సాయి, విశాఖపట్నం, టెన్నిస్, ఏషియన్‌ గేమ్స్‌ సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
2. వెన్నం జ్యోతి సురేఖ, ఎన్టీఆర్‌ జిల్లా, ఆర్చరీ, ఏషియన్‌ గేమ్స్‌లో 3 గోల్డ్‌ మెడల్స్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 90 లక్షలు.
3. కిడాంబి శ్రీకాంత్, గుంటూరు, బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
4. ఆర్‌. సాత్విక్‌ సాయిరాజ్, రాజమహేంద్రవరం, బాడ్మింటన్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్, గోల్డ్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 50 లక్షలు.
5. యర్రాజీ జ్యోతి, విశాఖపట్నం, అథ్లెటిక్స్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
6. బొమ్మదేవర ధీరజ్, ఆర్చరీ, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
7. కోనేరు హంపి, ఎన్టీఆర్‌ జిల్లా, చెస్, ఏషియన్‌ గేమ్స్‌లో సిల్వర్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 20 లక్షలు.
8. బి.అనూష, అనంతపూర్, క్రికెట్, ఏషియన్‌ గేమ్స్‌లో గోల్డ్‌ మెడల్‌ విజేత, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నగదు బహుమతి రూ. 30 లక్షలు.

ఈ నగదు పురస్కారంతో పాటు గతంలో పతకాలు సాధించినందుకు ఇచ్చే ప్రోత్సాహక బకాయిలు మొత్తం రూ. 4. 29 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఏషియన్‌ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారులు మొత్తం 11 పతకాలు (5 గోల్డ్, 6 సిల్వర్‌) సాధించారు.

Updated On 20 Oct 2023 5:48 AM GMT
Ehatv

Ehatv

Next Story