ఏపీలో ఈ రోజు నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో OP, EHS సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది.

ఏపీలో ఈ రోజు నుంచి ఎన్టీఆర్ వైద్యసేవ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో OP, EHS సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. రూ.3వేల కోట్ల ప్రభుత్వ బకాయిలతో ఆస్పత్రుల నిర్వహణ కష్టతరమైందని చెప్పింది. ప్రభుత్వం మీద గౌరవంతో కేవలం 2 సేవలే నిలిపేస్తున్నట్లు పేర్కొంది. 25 వరకూ ప్రభుత్వానికి సమయం ఇస్తున్నట్లు, అప్పటికి రూ. 1500 కోట్లు బకాయిలు విడుదల చేయకపోతే సేవలు పూర్తిగా నిలిపేస్తామని హెచ్చరించింది.

ehatv

ehatv

Next Story