Asaduddin : జగన్ పాలన పర్వాలేదు.. చంద్రబాబును నమ్మలేం
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో(Skill Development Case) అరెస్టై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chaandrababu) రాజమండ్రి సెంట్రల్ జైలులో(Rajahmundry central jail) రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఏఐఎంఐఎం(AIMIM) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్(Asaduddin ) ఓవైసీ స్పందించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో(Skill Development Case) అరెస్టై టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chaandrababu) రాజమండ్రి సెంట్రల్ జైలులో(Rajahmundry central jail) రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ఏఐఎంఐఎం(AIMIM) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) స్పందించారు. తెలుగు రాష్ట్రాల మజ్లిస్ కార్యకర్తలతో హైదరాబాద్‌లోని ఏఐఎంఐఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. రాజమండ్రి జైలులో చంద్రబాబు చాలా హ్యాపీగా ఉన్నారని అన్నారు. ఆయన జైలుకు ఎందుకు వెళ్లారో అందరికీ తెలుసునన్నారు. ప్రస్తుతం ఏపీలో రెండే పార్టీలు ఉన్నాయని.. అందులో ఒకటి టీడీపీ.. రెండోది జగన్(Jagan) వైసీపీ పార్టీ అని అన్నారు.
ఈ క్రమంలోనే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంచి పాలన అందిస్తున్నారని అసద్ ప్రశంసించారు. జగన్ పాలన పర్వాలేదు.. కానీ చంద్రబాబును నమ్మలేమని అన్నారు. ప్రజలు కూడా ఆయనను నమ్మొద్దని అసదుద్దీన్ అన్నారు. ఏపీలో పోటీ చేసే విషయమై అసదుద్దీన్ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోనూ పోటీ చేసే ఆలోచనలో ఉన్నామ.. అయితే అక్కడ ఎంఐఎం పని చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.