Arrest Warrant : కొడాలినాని, పార్థసారధి, వంగవీటి రాధాకు అరెస్టు వారెంట్ జారీ
వైసీపీ ఎమ్మెల్యేలకు విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. వైసీపీ సీనియర్ నేతలైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి, ప్రస్తుత టీడీపీ నేత వంగవీటి రాధాకు ఈ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.

Arrest Warrant to YSRCP Mlas and TDP leader
వైసీపీ(YSRCP) ఎమ్మెల్యేలకు విజయవాడ(Vijayawada)లోని ప్రజాప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్లు(Arrest Warrent) జారీ చేసింది. వైసీపీ సీనియర్ నేతలైన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని(Gudivada MLA Kodali Nani), పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధి(Parthasaradhi), ప్రస్తుత టీడీపీ నేత వంగవీటి రాధా(Vangaveeti Radha)కు ఈ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి.
2015వ సంవత్సరం ఆగస్టు 29న ప్రత్యేక హోదా(Special Status)కై డిమాండ్ చేస్తూ.. విజయవాడ బస్టాండ్(Viajayawada Bus Stand) ఎదుట వైసీపీ నేతలు ధర్నా చేశారు. ఆందోళనపై కృష్ణలంక పోలీసులు(Krishnalanka Police) కేసు నమోదు చేశారు. సుమారు 55 మందిపై పలు సెక్షల కింద కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ఏ1గా కొలుసు పార్థసారథి, ఏ2గా కొడాలి నాని, ఏ3గా వంగవీటి రాధాతోపాటు 52 మంది పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.
ఈకేసుపై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరుగుతోంది. ప్రధాన నిందితులుగా ఉన్న పార్థ సారధి, కొడాలి నాని, వంగవీటి రాధాకృష్ణలు నిన్నటి విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి అరెస్టు వారెంట్లు జారీ చేశారు.
