ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆరోగ్య శ్రీ సేవలను

ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేస్తూ ఆస్పత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కింద సేవలు పొందుతున్న వారికి చికిత్సలు కొనసాగిస్తామని, కొత్తగా మాత్రం ఎవరినీ చేర్చుకోబోమని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ప్రకటించాయి. గడిచిన కొన్ని నెలల నుంచి బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో లక్ష్మీషా హెచ్చరించారు.

2023-24లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి 3,566.22 కోట్లు నెట్‌ వర్క్‌ ఆసుపత్రులకు జమ చేశామని లక్ష్మీషా తెలిపారు. గతంలోని హామీ ప్రకారం ఇప్పటికే 203 కోట్లు విడుదల చేశామని.. 2024-25 మొదటి రెండు నెలల్లో ఇప్పటివరకు రూ.366 కోట్లు విడుదల చేశామని తెలిపారు. గత ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా 42.91 లక్షల మందికి వైద్యసేవలు అందించామన్నారు. అంతేకాకుండా ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 13,471 కోట్లు ఖర్చు చేశామని.. మిగిలిన బకాయిలు త్వరలోనే విడుదల చేస్తామని ట్రస్ట్‌ సీఈవో లక్ష్మీషా వెల్లడించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అంతరాయం కలిగిస్తే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated On 24 May 2024 2:26 AM GMT
Yagnik

Yagnik

Next Story