Chandrababu Quash Petition Hearing: క్వాష్ పిటిషన్‌కు చంద్రబాబు అనర్హుడు.. కోర్టులో ముకుల్ రోహత్గీ వాదనలు
చంద్రబాబు(Chandrababu) క్వాష్ పిటిషన్‌పై(Quash Petition) హైకోర్టులో మంగళవారం వాదనలు కొనసాగుతున్నాయి. తొలుత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే(Harish Salve), సిద్ధార్థ లూద్రాలు(Siddharth Luthra) వాదనలు వినిపించారు. సిఐడి(CID) తరఫున ముకుల్ రోహత్గీ(Mukul Rohathgi) వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ ఎన్‌సైక్లోపీడియా కాదని..
చంద్రబాబు(Chandrababu) క్వాష్ పిటిషన్‌పై(Quash Petition) హైకోర్టులో మంగళవారం వాదనలు కొనసాగుతున్నాయి. తొలుత చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే(Harish Salve), సిద్ధార్థ లూద్రాలు(Siddharth Luthra) వాదనలు వినిపించారు. సిఐడి(CID) తరఫున ముకుల్ రోహత్గీ(Mukul Rohathgi) వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ ఎన్‌సైక్లోపీడియా కాదని.. స్కిల్ పథకానికి కేబినెట్ ఆమోదం లేదని కోర్టుకు తెలిపారు. క్వాష్ పిటిషన్ కు చంద్రబాబు అనర్హుడు అంటూ వాదనలు వినిపించారు.
చంద్రబాబును అరెస్టు చేసి 10 రోజులే అవుతుంది. సెక్షన్ 139 ప్రకారం ఎన్ని ఛార్జ్‌షీట్‌లైనా వేయొచ్చు.. ఎఫ్ఐఆర్‌లో ఎంత మందిని అయినా చేర్చవచ్చని అన్నారు. రెండేళ్ల పాటు విచారించాక అన్ని సాక్ష్యాధారాలతో చంద్రబాబుని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. షెల్ కంపెనీలపై విచారణ జరుగుతుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రూ.371 కోట్లు ఎక్కడకి వెళ్లాయి అన్నది తేలాల్సి ఉందని వివరించారు. బోగస్ కంపెనీలతో కలిసి ప్రజాధనాన్ని దోచుకున్నారని.. పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి క్వాష్ పిటిషన్ ను కొట్టేయాలని వాదనలు వినిపించారు.