కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్‌ పదవుల కోసం పైరవీలు మొదలయ్యాయి

ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) తెలుగుదేశంపార్టీ(TDP) నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్‌ పదవుల కోసం పైరవీలు మొదలయ్యాయి. టీడీపీ వాళ్లే కాదు, జనసేన(Janasena), బీజేపీ(BJP) నేతలు కూడా నామినేటెడ్‌ పదవుల కోసం ప్రయత్నిస్తున్నారు. చాలా మంది దృష్టి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD Board) ఛైర్‌పర్సన్‌(chairperson), బోర్డు సభ్యులపైనే(Board persons) ఉంది. టీటీడీ ఛైర్‌పర్సన్‌ ఎవరనేది ఇంకా తేలలేదు. ఆ మధ్యన ఓ మీడియా అధినేత పేరు వినిపించింది కానీ దానిపై తెలుగుదేశంపార్టీ(TDP) అధినాయకత్వం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఎవరికి ఇవ్వాలో చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారు. బోర్డు సభ్యుల విషయానికి వస్తే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి(Vemireddy Prashanti reddy), తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన మాజీ జడ్పీటీసీ సభ్యుడు పేరం ధనుంజయనాయుడు(Peram dhanunjay naidu) పేర్లు వినిపిస్తున్నాయి. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan Mohan reddy) ప్రభుత్వంలో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి టీటీడీలో సభ్యురాలిగా పని చేశారు.

అలాగే టీటీడీ ఢిల్లీ స‌ల‌హామండ‌లి చైర్‌ప‌ర్స‌న్‌గా కూడా ప‌ని చేశారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు వేమిరెడ్డి దంప‌తులు టీడీపీలో చేరారు. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి నెల్లూరు ఎంపీగా, ప్ర‌శాంతిరెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా తెలుగుదేశంపార్టీ తరఫున విజయం సాధించారు కూడా. నెల్లూరు జిల్లా రాజ‌కీయాల్లో వేమిరెడ్డి దంప‌తులు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అందుకే ప్ర‌శాంతికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో స్థానం లభించనుందని అంటున్నారు. మరోవైపు ధ‌నుంజ‌య‌నాయుడికి కూడా టీటీడీ బోర్డులో చోటు కన్ఫామ్‌ అయ్యిందని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి శ్రీ‌కాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో ధ‌నుంజ‌య‌నాయుడు క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బొజ్జ‌ల కుటుంబానికి ఆయ‌న విధేయుడిగా వుంటూ వ‌స్తున్నారు. గ‌తంలో బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డికి, ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడైన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి ముఖ్య అనుచ‌రుడిగా ధనుంజయనాయుడు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యనే ధనుంజయనాయుడు మంత్రి నారా లోకేశ్‌ను కలుసుకున్నారు. అప్పుడే టీడీపీ బోర్డులో అవకాశం ఇస్తామని లోకేశ్‌ చెప్పారట! ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు కూడా ధనుంజయనాయుడుకు మద్దతు ఇస్తున్నారని తెలిసింది.

Eha Tv

Eha Tv

Next Story