YS Sharmila : దమ్ముంటే ఇది నిజమో కాదో మా అమ్మ విజయమ్మతో చెప్పించండి
ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదని.. కితాబు ఇవ్వక పోతే నా విలువ తక్కువ కాదని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు.

APPCC chief YS Sharmila Reddy challenges YCP leaders
ఎవరో నాకు కితాబు ఇస్తే నా విలువ ఎక్కువ కాదని.. కితాబు ఇవ్వక పోతే నా విలువ తక్కువ కాదని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) అన్నారు. నేను వైఎస్సార్(YSR) రక్తం. రాజశేఖర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి(YS Rajashekar Reddy) అయినప్పుడు ఆయన బిడ్డ వైఎస్ షర్మిలా రెడ్డి కాకుండా ఎలా పోతుందని ప్రశ్నించారు. మనవడు రాజారెడ్డి(Rajareddy) కి ఆపేరు పెట్టింది వైఎస్సార్ అని పేర్కొన్నారు. నిజం ఎప్పుడూ నిలకడగా నిలుస్తుందన్నారు. వైఎస్సార్ ఆశయాల కోసమే నేను కాంగ్రెస్(Congress) లో చేరానని పేర్కోన్నారు. నా దగ్గరి మనుషులు కూడా ఎన్నెన్నో మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. నా పాదయాత్ర గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. భారతమ్మ(Bharathi) చేయాలని అనుకున్న పాదయాత్ర నేను చేశానట.. నా స్వార్థం కోసం పాదయాత్ర చేశానట.. జైల్లో అధికారి చెప్పాడట.. దమ్ముంటే అప్పటి జైలు అధికారి తో ఈ విషయం చెప్పించ గలరా? దేవుడు మీద ప్రమాణం చేయగలరా.? అని సవాల్ విసిరారు.
ఆ రోజు ఏం జరిగిందో నేను ప్రమాణం చేసి చెప్పగలను. నాకు నేనుగా ఎప్పుడు పాదయాత్ర చేయలేదు. నన్ను అడిగితే తప్పా నేను పాదయాత్ర చేయలేదని స్పష్టం చేశారు. మేము అక్రమ సంపాదన కి స్కెచ్ వేశామని చెప్తున్నారు. జగన్ రెడ్డి(Jagan Reddy) అధికారంలో వచ్చిన తర్వాత కేవలం ఒక్క సారి మాత్రమే విజయమ్మతో మాత్రమే వెళ్ళాను. నా భర్త అనిల్(Anil) ఒక్క రోజు కూడా జగన్ రెడ్డి గారిని కలవలేదు. తప్పుడు నిందలు వేయాలని చూస్తే పైన దేవుడు ఉన్నాడు. జగన్ గారు ముఖ్యమంత్రి కావాలని నిస్వార్థంగా కోరుకున్న.. దమ్ముంటే ఇది నిజమో కాదో అమ్మ విజయమ్మ తో చెప్పించండని వ్యాఖ్యానించారు.
