టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు(Nara Lokesh) సీఐడీ నోటీసులు(CID Notices) అందించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో(Inner Ring Road Case) లోకేష్‌ ఏ14(A14) నిందితుడిగా ఉన్నారు. దీంతో లోకేశ్‌కు సీఆర్పీసీ 41(A)(CRPC 41A) కింద అధికారులు నోటీసులు అందజేశారు.

టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు(Nara Lokesh) సీఐడీ నోటీసులు(CID Notices) అందించింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో(Inner Ring Road Case) లోకేష్‌ ఏ14(A14) నిందితుడిగా ఉన్నారు. దీంతో లోకేశ్‌కు సీఆర్పీసీ 41(A)(CRPC 41A) కింద అధికారులు నోటీసులు అందజేశారు. ఢిల్లీ అశోకా రోడ్డు-50 లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు అంద‌జేసిన‌ట్లు తెలుస్తుంది. అక్టోబర్‌ 4న ఉదయం 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో సీఐడీ పేర్కొంది.

అంత‌కుముందు ఢిల్లీలోని గల్లా జయదేవ్(Galla Jayadev) నివాసం వద్ద హైడ్రామా చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41A కింద నారా లోకేష్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్లారు సీఐడీ అధికారులు. లోకేష్.. గల్లా జయదేవ్ ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. ఐతే మొదట సీఐడీ ఎంట్రీకి.. జయదేవ్ సిబ్బంది గేట్లు ఓపెన్ చేయలేదు. కాసేపు ఉద్రిక్తత తర్వాత గేట్లు ఓపెన్ చేశారు సిబ్బంది. అనంతరం లోపలికి వెళ్లిన సీఐడీ అధికారులు..లోకేష్ కు నోటీసులు అందజేశారు.

Updated On 30 Sep 2023 6:57 AM GMT
Ehatv

Ehatv

Next Story