YS Sharmila: వైఎస్ షర్మిల రచ్చబండ.. నేటి నుండే
కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చేందుకు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుంది కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 7 నుంచి 11వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆమె ఇటీవల తొలి విడత పర్యటనను పూర్తి చేసి జిల్లాల్లోని పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇతర నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు జనాల్లోకి వెళ్లాలని భావిస్తూ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఏపీలో పునర్వైభవం తీసుకువచ్చేందుకు వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు వైఎస్ షర్మిల నేతృత్వంలో కార్యాచరణను రూపొందిస్తున్నారు. ఈనెల 7 నుంచి 11 వరకు షర్మిల జిల్లాల పర్యటన సాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. పలు నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలో ఏపీసీసీ చీఫ్ పాల్గొననున్నారు.
వైఎస్ షర్మిల పర్యటన వివరాలు:
ఈ నెల 7న సాయంత్రం బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభ
ఈ నెల 8న ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ
8న సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరు నియోజకవర్గంలో బహిరంగ సభ
ఈ నెల 9న ఉదయం 10 గంటలకు కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ
9న సాయంత్రం 5 గంటలకు తుని నియోజకవర్గంలో బహిరంగ సభ
ఈ నెల 10న ఉదయం నర్సీపట్నం నియోజకవర్గంలో రచ్చబండ
10న సాయంత్రం 5 గంటలకు పాడేరు నియోజకవర్గంలో బహిరంగ సభ
ఈ నెల 11 న సాయంత్రం 5 గంటలకు నగరి నియోజకవర్గంలో బహిరంగ సభ