అది వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయం. అప్పుడామె ఏమన్నారు? తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? తెలుగుదేశంపార్టీ నుంచి వచ్చిన ఓ దొంగ రేవంత్‌ రెడ్డి(Revanth reddy) కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉన్నాడు అని అన్నారు. అప్పుడే ఓ విలేకరి కల్పించుకుని రాహుల్‌గాంధీని(Rahul gandhi) ప్రధానిగా చూడాలన్నది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కోరిక కదా అని ఆమెను అడిగాడు. దానికి షర్మిల ఇచ్చిన సమాధానం ఏమిటంటే ' రాజశేఖర్‌రెడ్డికి ఏం తెలుసండి? చనిపోయిన తర్వాత తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తారని రాజశేఖర్‌రెడ్డి అనుకోలేదు కదా! ఈ దిక్కుమాలిన కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది కదా! ఆ పార్టీకి ఎలా సపోర్ట్‌ ఇస్తాను?' అని చెప్పుకొచ్చారు.

అది వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న సమయం. అప్పుడామె ఏమన్నారు? తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీకి అధ్యక్షుడు ఎవరు? తెలుగుదేశంపార్టీ నుంచి వచ్చిన ఓ దొంగ రేవంత్‌ రెడ్డి(Revanth reddy) కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉన్నాడు అని అన్నారు. అప్పుడే ఓ విలేకరి కల్పించుకుని రాహుల్‌గాంధీని(Rahul gandhi) ప్రధానిగా చూడాలన్నది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కోరిక కదా అని ఆమెను అడిగాడు. దానికి షర్మిల ఇచ్చిన సమాధానం ఏమిటంటే ' రాజశేఖర్‌రెడ్డికి ఏం తెలుసండి? చనిపోయిన తర్వాత తన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తారని రాజశేఖర్‌రెడ్డి అనుకోలేదు కదా! ఈ దిక్కుమాలిన కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ఆర్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది కదా! ఆ పార్టీకి ఎలా సపోర్ట్‌ ఇస్తాను?' అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు సీన్‌ మారింది.. అదే షర్మిల అదే కాంగ్రెస్‌ పార్టీకి చీఫ్‌ అయ్యారు. కాకపోతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి! తోడబుట్టిన అన్న వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై(CM Jagan) ఉన్న కోపంతో ఆమె ఏం చేస్తున్నారో ఏం మాట్లాడుతున్నారో ఆమెకే తెలియడం లేదు. ఆమె ఏకైక లక్ష్యమల్లా జగన్‌ను సీఎం పదవి నుంచి దించేయడం! అందుకోసం అవసరమైతే టీడీపీతో(TDP) కూడా కలవడానికి ఆమె సిద్ధం! తన ప్రసంగంలో పదే పదే జగన్ రెడ్డి అంటూ సంబోధించడం వ్యంగంగా అనిపించలేదు. ఆమెలోని అహంకారాన్ని చాటింది. జగన్‌పై కోపంతో ఏం చేయాలో తెలియక తెలంగాణలో రాజకీయపార్టీ పెట్టారు. తానే కాబోయే ముఖ్యమంత్రి అన్నారు. టీఆర్‌ఎస్‌ నేతలపై ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. తెలంగాణ ప్రజలు చాలా లైట్‌ తీసుకున్నారు. అప్పటికే పార్టీ కోసం బోల్డంత ఖర్చు పెట్టేశారు. తన పార్టీని విలీనం చేస్తానంటూ కాంగ్రెస్‌ పార్టీకి ఓ హింట్‌ ఇచ్చారు. సోనియాగాంధీని కలిశారు. రాహుల్‌, ప్రియాంకలతో చర్చలు జరిపారు. అయితే కాంగ్రెస్‌ అధినాయకత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో తెలంగాణలో పోటీ చేయకుండా తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ షర్మిలను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ ఆమెకు ఆయాచితవరాన్ని ఇచ్చింది. జగన్ చెల్లెలుగా మీడియా ఫోకస్‌ షర్మిలపై ఉంటుందన్న సంగతి కాంగ్రెస్‌కు తెలియంది కాదు! పైగా జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల ఏం మాట్లాడినా హైలైట్ చేయడానికి టీడీపీ అనుకూల మీడియా రెడీగా ఉంటుందన్న సంగతి కూడా తెలుసు. అందుకే జగన్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణలోనే తన చావైనా బతుకైనా అంటూ భారీ డైలాగులు చెప్పిన షర్మిల ఇప్పుడు ఏపీకి షిఫ్టవ్వడంతోనే ఆమె నిర్ణయాలు ఎంత స్థిరంగా ఉంటాయో అర్థమయ్యింది. రాబోయే వంద రోజుల్లో షర్మిల ఇంకెన్ని అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

Updated On 22 Jan 2024 5:42 AM GMT
Ehatv

Ehatv

Next Story