YS sharmila : రాహుల్‌కు ధన్యవాదాలు చెప్పిన షర్మిల.. ఎందుకో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(Congress) చీఫ్ వై.ఎస్.షర్మిల(YS sharmila) తమ అధినేత రాహుల్‌గాంధీకి(rahul gandhi) ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(Congress) చీఫ్ వై.ఎస్.షర్మిల(YS sharmila) తమ అధినేత రాహుల్‌గాంధీకి(rahul gandhi) ధన్యవాదాలు తెలిపారు. అమెరికా పర్యటనలో(America tour) ఉన్న ఆయన తెలుగు భాష(Telugu language) గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినందుకు థాంక్స్ చెప్పారు షర్మిల. ఈ మేరకు ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. 'ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలుగు భాష గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినందుకు ధన్యవాదములు. తెలుగు భాషలో చరిత్ర, సంస్కృతి, నృత్యం, ఆహారపు అలవాట్లు ఉన్నాయని.. హిందీ భాషను తెలుగు రాష్ట్రాలపై రుద్దడం అంటే తెలుగు భాషా పూర్వీకులను అవమానించడమే అని రాహుల్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యం. RSSలాగా భారతదేశానికి ఒకే భావజాలం ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కోరుకోదు.. భిన్నత్వంలో ఏకత్వమే కాంగ్రెస్ భావజాలం అన్న రాహుల్ గాంధీ గారి మాటలను పూర్తిగా ఏకీభవిస్తున్నాను' అని షర్మిల ట్వీట్ చేశారు.