మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan), ఆయన సతీమణి భారతిపై(Bharathi) ఏపీ కాంగ్రెస్‌పార్టీ(APCC) అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) రగిలిపోతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan), ఆయన సతీమణి భారతిపై(Bharathi) ఏపీ కాంగ్రెస్‌పార్టీ(APCC) అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల(YS Sharmila) రగిలిపోతున్నారు. ఒక్కోసారి షర్మిల మాటలు చూస్తుంటే ఆగర్భ శత్రువుపై కూడా ఇంతగా కసి ఉండదేమోనని అనిపిస్తుంటుంది. ఇప్పటికిప్పుడు అన్నా వదినలిద్దరిని జైలుకు పంపించాలన్నంతగా ఉడికిపోతున్నారు. వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి(YS rajashekar reddy) అభిమానులు షర్మిల తీరు బాధపెడుతున్నది. మైక్‌ దొరికితే ఆలస్యం.. అన్నా వదినపై విమర్శలు మొదలుపెడుతున్నారు షర్మిల. విపక్షంలో ఉన్నవారు అధికార పక్షంపై విమర్శలు చేస్తారు. ఇది సహజం. కానీ షర్మిల మాత్రం చంద్రబాబును ఏమీ అనకుండా ఎంతసేపూ జగన్‌ను ఆడిపోసుకోవడానికే సమయం కేటాయిస్తున్నారు. ఆస్తులను పంచలేదన్న కోపంతో జగన్‌పై విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. ఆస్తుల పంపకం(Assests dispute) ప్రజా సమస్య ఎలా అవుతుందన్న లాజిక్కును షర్మిల మిస్సవుతున్నారు. కడపలో విలేకరుల సమావేశం పెట్టి మరీ కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిని(MP Avinash reddy) సోషల్ మీడియా(Social media) పోస్టులకు సంబంధించి అరెస్ట్ చేయాలంటూ డిమాండ్‌ చేశారు. సరే, అక్కడితో షర్మిల ఆగారా? సంబంధం లేకుండా జగన్‌, భారతిలను(YS Bharathi) కూడా అరెస్ట్ చేయాలనే అర్థంలో మాట్లాడారు. 'ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టానంటూ వాటిని పెట్టిన వ్యక్తే స్పష్టంగా చెప్పినపుడు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకోలేదో, ఎందుకు విచారించలేదో పోలీసులు చెప్పాలని షర్మిల ప్రశ్నిస్తూ చేయించేవాళ్లు ఏ ప్యాలెస్‌లలో బతుకుతున్నా అరెస్ట్ చేసి ఆడవాళ్లకు భద్రత కల్పించాలని అన్నారు. ఏ ప్యాలెస్‌లలో ఉన్నా అంటే అర్థమేమిటి? ప్యాలెస్‌లలో జగన్‌ ఉంటున్నారు అన్నది టీడీపీ అనుకూల మీడియా చేసిన ప్రచారంలో ఓ భాగమే కదా! అంటే తాడేప‌ల్లిలో ఉన్న త‌న అన్న‌ జగన్‌, వ‌దిన‌ భారతిల‌ను ఎందుకు అరెస్ట్ చేయ‌లేద‌ని ప్రభుత్వాన్ని షర్మిల నిలదీస్తున్నారన్నమాట! జగన్‌ అరెస్ట్‌కు ఆడవాళ్ల భద్రతకు సంబంధమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్‌ జైల్లో కాకుండా బయట ఉంటే ఆడవాళ్లకు భద్రత ఉండదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, అఘాయిత్యాలకు జగన్‌ బాధ్యులని షర్మిల అనుకుంటున్నారా? అసలు ఆమె ఏం చెప్పదల్చుకున్నట్టు? కాస్త ప్రిపేర్‌ అయ్యి వస్తే ఇలాంటి అర్థం పర్థం లేని మాటలు రాకుండా ఉంటాయి. ఆవు వ్యాసంలా ప్రతీ అంశంలోనూ అన్నా వదిలను ఎందుకు లాగుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే.. షర్మిల సారథ్యంలో ఆ పార్టీ ఎలా తయారుతుందో ఏమో పాపం!

Eha Tv

Eha Tv

Next Story