YS Sharmila : కడపలో పోటీ .. ఇక రాజకీయ జీవితానికి తెరపడినట్టే!
మొత్తంమీద అందరూ అనుకున్నదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల(YS sharmila) కడప(Kadapa) లోక్‌సభ నుంచి పోటీ చేయబోతున్నారు. కడప నుంచి పోటీ చేయడమంటే చేజేతులా ఆమె రాజకీయ జీవితాన్ని అంతం చేసుకోవడమేనన్నది చాలా మంది భావన! షర్మిల పోటీ చేస్తున్నది ఎవరిపైనో కాదు, వరుసకు సోదరుడు అయ్యే వై.ఎస్.అవినాష్‌రెడ్డిపైనే!(YS Avinash) మీడియాకు ఇది ప్రధానవార్త కావచ్చు.
మొత్తంమీద అందరూ అనుకున్నదే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల(YS sharmila) కడప(Kadapa) లోక్‌సభ నుంచి పోటీ చేయబోతున్నారు. కడప నుంచి పోటీ చేయడమంటే చేజేతులా ఆమె రాజకీయ జీవితాన్ని అంతం చేసుకోవడమేనన్నది చాలా మంది భావన! షర్మిల పోటీ చేస్తున్నది ఎవరిపైనో కాదు, వరుసకు సోదరుడు అయ్యే వై.ఎస్.అవినాష్‌రెడ్డిపైనే!(YS Avinash) మీడియాకు ఇది ప్రధానవార్త కావచ్చు. రాజకీయ విశ్లేషకులకు ఇది ఆసక్తికరమైన అంశం కావచ్చు కానీ దీనివల్ల షర్మిలకు కలిగే ప్రయోజనం మాత్రం శూన్యమన్నది అందరికీ తెలిసిన విషయమే! తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టేసి, పాదయాత్ర చేసేసి, బీఆర్‌ఎస్ నాయకులను అడ్డూ అదుపూ లేకుండా తిట్టేసి ఆనక పార్టీని చాపచుట్టేసిన వైనం తాజాగానే ఉంది. ముఖ్యమంత్రి అవుతానన్న ధీమాను వ్యక్తం చేసిన షర్మిల చివరకు పోటీలోంచి తప్పుకున్నారు. కాంగ్రెస్(Congress) పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అలాగే దూకుడును ప్రదర్శిస్తున్నారు. తన అన్న జగన్మోహన్‌రెడ్డిపై రవ్వంత ఎక్కువగానే విమర్శలు కురిపించారు. ఇప్పుడు అన్న మీద కోపంతో కడపలో పోటీకి దిగుతున్నారు. నిజం చెప్పాలంటే కడపతో షర్మిలకు ఉన్న అనుబంధం అంతంత మాత్రమే! వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్నప్పుడు ఆయనతో కలిసి జిల్లాకు వస్తూవెళుతూ ఉండేవారంతే! కడపకు వచ్చినప్పుడు ఇడుపులపాయలో బస చేసేవారు. తండ్రి మరణానంతరం అన్న జగన్ కోసం పాదయాత్ర చేశారు. ఎన్నికల ప్రచారంలోనూ పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూతురుగా, జగన్‌కు సోదరిగా మాత్రమే షర్మిలకు గుర్తింపు ఉంది కానీ ఆమెకంటూ ప్రత్యేకించి ఓ ఐడెంటిటీ ఇప్పటి వరకు లేదు. అలాంటి షర్మిల తనకు తాను ఎక్కువగా ఊహించుకుని కడప నుంచి పోటీకి సిద్ధపడుతున్నారన్నది అక్కడి ప్రజల మాట!