YS Sharmila : అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తారా..
నువ్వేమన్నా పిప్పర్మెంట్ తినే పిల్లాడివా..
వైఎస్ జగన్‌పై(YS Jagan) మరోసారి ఎక్స్‌వేదికగా(Twitter) ఘాటైన వ్యాఖ్యలు చేశారు షర్మిల(YS SHarmila). అసెంబ్లీకి(Assembly) వెళ్లకూడదన్న జగన్ నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేస్తూ ఘాటైన విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేశారు. ' అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుంది YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి తీరు. అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు ప్రజలు ఓట్లేసింది ? ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించింది ? మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే...
ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా అనడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనం. అసెంబ్లీ అనేది ప్రజాస్వామ్య దేవాలయం.
ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు ఇచ్చే గొప్ప అవకాశం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు దిక్కులేదు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోంది.
మహిళలపై దాడులు ఆగడం లేదు. ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. బెల్టు షాపుల దందాను అరికట్టలేదు. 5 నెలలైనా ఒక్క ఉద్యోగం భర్తీ కాలేదు.
రోజు రోజుకు నిరుద్యోగం పెరుగుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం YCPకి ప్రజలు ఇస్తే. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం అనడం సిగ్గు చేటు. ప్రతిపక్షం లేకుంటే సభలోనే ప్రజాపక్షం అవ్వాలని ఇంగితం కూడా లేకపోవడం బాధాకరం. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితం అయినా.. కుంగిపోలేదు. మీ లెక్క హోదా కావాలని మారం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం.
ఎన్నో సమస్యలపై ఆనాడు టీడీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపించింది కాంగ్రెస్ పార్టీ. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితం అయినా, 2019లో 52 సీట్లే వచ్చినా ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. హోదా లేకున్నా రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించారు. నియంత మోడీ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. దేశ ప్రజల సమస్యలపై కాంగ్రెస్ గొంతుకగా మారింది. ఇప్పటికైనా మీ పిచ్చితనాన్ని పక్కన పెట్టీ అసెంబ్లీకి వెళ్ళండి. కూటమి నిర్లక్ష్యాన్ని ఎండగట్టండి. అసెంబ్లీకి వెళ్ళే దమ్ము ధైర్యం లేకుంటే YCP శాసనసభా పక్షం మొత్తం రాజీనామాలు(Resign) చేయండి. అప్పుడు ఇంట్లో కాదు..ఎక్కడైనా కూర్చుని తాపీగా మాట్లాడుకోండి' అంటూ దుమ్మెత్తిపోశారు షర్మిల.
- YS SharmilaAPCC ChiefYS Jagan Mohan ReddyYCP MLAsAndhra Pradesh politicsYS Sharmila challengeYS Jagan Assembly attendanceYCP resignation challengeYS Sharmila statementYCP MLAs resignationYS Jagan Assembly controversypolitical leaders Andhra PradeshYCP internal politicsYS Sharmila vs YS JaganYS Jagan Assembly boycottehatv