APCC YS Sharmila : ఇవాళే షర్మిల కొడుకు నిశ్చితార్థం.. హాజరుకానున్న జగన్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(APCC) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల(YS sharmila) కుమారుడు రాజారెడ్డి(Raja Reddy), ప్రియ అట్లూరి(Priya atluri) నిశ్చితార్థం హైదరాబాద్‌లోని గోల్కొడ రిసార్ట్స్‌లో(Golconda Resorts) ఇవాళ జరగనుంది. మేనల్లుడి నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Mohan Reddy) సతీ సమేతంగా హాజరవుతున్నారు.
కేసీఆర్(KCR), కేటీఆర్‌లకు(KTR) అందని ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ(APCC) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల(YS sharmila) కుమారుడు రాజారెడ్డి(Raja Reddy), ప్రియ అట్లూరి(Priya atluri) నిశ్చితార్థం హైదరాబాద్‌లోని గోల్కొడ రిసార్ట్స్‌లో(Golconda Resorts) ఇవాళ జరగనుంది. మేనల్లుడి నిశ్చితార్థానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Mohan Reddy) సతీ సమేతంగా హాజరవుతున్నారు. అలాగే రాష్ట్రంలోని ప్రముఖులు, వివిధ పార్టీల అధినేతలు, కాంగ్రెస్(Congress) నేతలు హాజరు కాబోతున్నారు. ఫిబ్రవరి 17న వివాహ వేడకను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అట్లూరి ప్రియా అమెరికాలో బీఏ (బిజినెస్ అడ్మినిస్టేషన్) చదువుతున్నప్పుడు రాజారెడ్డితో పరిచయం ఏర్పడింది. ఫ్రెండ్‌షిప్ ప్రేమగా మారింది. ప్రస్తుతం ప్రియా ఓ ప్రముఖ కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth reddy), మాజీ మంత్రి హరీశ్‌రావు(Harish Rao), టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu), జనసేన అధినేత పవన్‌కల్యాణ్(Pawankalyan), కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లతో(DK shiva kumar) పాటు ప్రముఖులందరినీ షర్మిల ఆహ్వానించారు. అయితే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(KCR), బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లకు(KTR) మాత్రం ఆహ్వానం అందనట్టుగా ఉంది. అందరిని ప్రత్యక్షంగా వెళ్లి కలిసి ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల ఎందుకోగానీ వీరిద్దరిని ఆ విధంగా ఆహ్వనించలేదు. ఎమ్మెల్సీ కవితకు కూడా ఇన్విటేషన్ అందనట్టుగా ఉంది.