ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను యావత్తు దేశమే పొగుడుతుంటే షర్మిల సచివాలయ వ్యవస్థపై బురదజల్లేలా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకురాలు, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల చేస్తున్న ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటిలేటర్‌ మీద ఉన్న కాంగ్రెస్‌ పార్టీని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్‌ పేరును ఆయన మరణం తరువాత ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి అవమానించిన కాంగ్రెస్‌ పార్టీలో చేరడమే కాకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావని షర్మిలపై కళ్యాణి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను అడ్డగోలుగా విభజించడమే కాకుండా ఇప్పటికీ రాజధాని లేని రాష్ట్రంగా తయారుచేసిన కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు.

ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడడం సబబు కాదని.. ఏపీలో గ్రామ సచివాలయ వ్యవస్థను యావత్తు దేశమే పొగుడుతుంటే షర్మిల సచివాలయ వ్యవస్థపై బురదజల్లేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిందని అన్నారు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల మధ్య తేడా కూడా తెలియకుండా మాట్లాడడం ఆమె అవగాహనారాహిత్యమని కళ్యాణి అన్నారు. వాస్తవాలు మాట్లాడడం షర్మిల నేర్చుకోకపోతే రానున్న కాలంలో ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Updated On 22 Feb 2024 11:01 PM GMT
Yagnik

Yagnik

Next Story