AP Weather News : ఆంధ్రప్రదేశ్‌కు పొంచి ఉన్న తుఫాన్ ముప్పు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు తుఫాన్ ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారుతుంది

AP Weather News
బంగాళాఖాతంలో(Bengal) ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌కు(Andhra Pradesh) తుఫాన్(Strom) ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్(South Andaman), మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారుతుంది. తర్వాత అది వాయవ్య దిశగా కదిలి శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాన్‌గా బలపడే అవకాశం ఉందంటున్నారు అమరావతి(Amaravati) వాతావరణ కేంద్రం(weather station) సంచాలకులు. డిసెంబర్ మొదటివారంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే మూడు రోజులలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపారు. ఇక కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పంటలు కోత దశలో ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలని హెచ్చరించారు.
