AP Rain Alert:ఏపీలో మరో మూడు రోజుల పాటు వర్షాలు .. ఈ ప్రాంతాల్లో వాతావరణశాఖ అలెర్ట్ .!
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక అంతర్భాగాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌కు(Andhra pradesh) వాతావరణ శాఖ(Weather Department) హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాలల్లో వర్ష సూచన జారీచేయటం జరిగింది .

weather
దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి విదర్భ, తెలంగాణ, కర్ణాటక అంతర్భాగాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌కు(Andhra pradesh) వాతావరణ శాఖ(Weather Department) హెచ్చరిక జారీ చేసింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాలల్లో వర్ష సూచన జారీచేయటం జరిగింది . అలాగే ఏపీ(AP), యానాం(Yanam) మీదుగా ట్రోపోస్పియర్ లో దక్షిణ, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలతో పాటు ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంతేకాదు రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తున్నాయి .
గత కొద్దిరోజులుగా ఎండ,వేడి గాలులతో అల్లాడుతున్న ప్రజలు .. అకాల వర్షాలు కురువటంతో వేడి నుండి ఉపశమనం పొందుతున్నారు. రాష్ట్రంలో ఆదివారం కురిసిన వర్షంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పిడుగుపాటుకు ఆరుగురు మృతి చెందారు. వర్షాల కారణంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడింది. చల్లటి గాలులు వీస్తున్నాయి . రానున్న మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Weather Department) తెలిపింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, వైఎస్‌ఆర్, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి . ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.
