☰
✕
ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన భూముల రీ సర్వేను టీడీపీ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది.
x
ఆంధ్రప్రదేశ్‌లో మాజీ సీఎం వైఎస్ జగన్ తెచ్చిన భూముల రీ సర్వేను టీడీపీ కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ- సర్వేను ప్రభుత్వం కొనసాగించనుంది. మండలానికి ఒక గ్రామాన్ని ఫైలట్ ప్రాజెక్టుగా తీసుకుని భూములు రీ సర్వే చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబందించి సర్వే టీమ్‌లను ఆయా జిల్లా కలెక్టర్లు నియమించనున్నారు. ఎంపిక చేసిన గ్రామంలో 200నుంచి 250 ఎకరాలను తొలుత సర్వే చేయాలని , రోజుకు 20 ఎకరాల వంతున రీ - సర్వే పూర్తి చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లు తహశీల్దార్లను ఆదేశించారు.
ehatv
Next Story