Chandrababu personal secretary suspended : చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి సస్పెండ్
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) మాజీ వ్యక్తిగత కార్యదర్శి (Personal Secretary) పి.శ్రీనివాస్‌ను(P.Srinivas) రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్(suspend) చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి(KS Jawar Reddy) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీసు నిబంధనలు అతిక్రమించి ఉన్నతాధికారులకు తెలపకుండా ఆయన అమెరికా వెళ్లారని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) మాజీ వ్యక్తిగత కార్యదర్శి (Personal Secretary) పి.శ్రీనివాస్‌ను(P.Srinivas) రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్(suspend) చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి(KS Jawar Reddy) శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీసు నిబంధనలు అతిక్రమించి ఉన్నతాధికారులకు తెలపకుండా ఆయన అమెరికా వెళ్లారని ఉత్తర్వులలో పేర్కొన్నారు. దీని కారణంగా శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు భావిస్తూ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం సచివాలయంలోని ప్రణాళికా విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా శ్రీనివాస్ ఉన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో(Skill Development) శ్రీనివాస్‌ను కూడా సీఐడీ(CID) నిందితుడిగా చేర్చింది.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు శ్రీనివాస్ కొంత కాలం పీఎస్(వ్యక్తిగత కార్యదర్శి)గా పని చేశారు. ఈ క్రమంలో స్కిల్ కేసులో శ్రీనివాస్ పేరును కూడా తెరపైకి వచ్చింది. ఆయనను విచారిస్తే.. మరికొంత సమాచారం దొరుకుతుందని భావిస్తోంది. అయితే శ్రీనివాస్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సీఐడీ చెబుతోంది. ఆయన తిరిగి రాష్ట్రానికి రావాలని కొంతకాలంగా కోరుతూ ఉండగా.. సెప్టెంబర్ 29వ తేదీని గడువుగా నిర్ణయించింది. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో.. ఏపీ సర్కార్ చర్యలకు ఉపక్రమించింది.