పదోతరగతి పరీక్షా ఫలితాలు శనివారం వెల్లడికానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో పది ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించారు.

పదోతరగతి పరీక్షా ఫలితాలు(Tenth Exams Results) శనివారం వెల్లడికానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) విజయవాడ(Vijayawada)లో పది ఫలితాల(10th Results)ను విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ మూడో తేదీ నుంచి 18వ తేదీ వరకు పదోతరగతి పరీక్షలు జరిగాయి. మొత్తం 3,349 కేంద్రాల్లో పరీక్షలు పకడ్బంధీగా నిర్వహించారు. 6,64,152 మంది విద్యార్ధులు ప‌రీక్ష‌లు రాశారు. పరీక్షలు రాసిన వారిలో బాలురు(Boys) 3,11,329, బాలికలు(Girls) 2,97,741 మంది ఉన్నారు. సప్లిమెంటరీ విద్యార్థులు(Supplementary) 53,410 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరితో పాటు ప్రైవేటు విద్యార్థులు(Privait Students) 1524 మంది, ప్రైవేటు సప్లిమెంటరీ విద్యార్థులు 147 మంది పరీక్షలు రాశారు.

ఇదిలావుంటే.. ఈసారి పదోతరగతి పరీక్షల్లో ప్రభుత్వం కొత్త విధానం(New Policy) తీసుకొచ్చింది. ప‌రీక్ష‌ల‌ను ఆరు పేపర్లకే పరిమితం చేసింది. బిట్ పేపర్ లేకుండానే ప్రశ్నాపత్రం తయారు చేశారు. పదో తరగతి పరీక్ష పేపర్‌లను ఏప్రిల్‌ 19 నుంచి 26 వరకు మూల్యాంకనం చేశారు. గతేడాది పదోతరగతి ఫలితాల విడుదల సందర్భంగా జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈసారి ఏలాంటి తప్పులకు అవకాశం లేకుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించింది. విద్యార్ధులు ఫ‌లితాల(Results) కోసం అధికారిక వెబ్‌సైట్‌ bse.ap.gov.inను చూడొచ్చు.

Updated On 5 May 2023 9:56 PM GMT
Yagnik

Yagnik

Next Story