Tenth Class Results: వచ్చేసిన ఏపీ 10వ తరగతి ఫలితాలు.. లింక్ ఇదే
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) ఈరోజు 10వ తరగతి ఫలితాలను
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (BSEAP) ఈరోజు 10వ తరగతి ఫలితాలను ప్రకటించింది. విజయవాడలోని తాజ్ వివంత (గేట్‌వే) గ్రాండ్ సెంట్రల్ హాల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఎస్ సురేష్ కుమార్ ఫలితాలను ప్రకటించారు. SSC ఫలితాల లింక్ అధికారిక BSEAP వెబ్‌సైట్ — results.bse.ap.gov.in లో అందుబాటులో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,743 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత శాతం 84.32గా నమోదు అయింది, బాలికల ఉత్తీర్ణత శాతం 89.17గా నమోదైంది. పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానం లో నిలిచింది. 96.3 శాతం ఉత్తీర్ణత సాధించింది. కర్నూల్ జిల్లా 62.47శాతం తో చివరి స్థానంలో నిలిచింది. 2803 స్కూల్స్ 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి.. 17స్కూల్స్ లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.