ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో

ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు చేపట్టింది. వాసుదేవరెడ్డి హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో నివాసం ఉంటున్నారు. ఈ ఉదయాన్నే వాసుదేవరెడ్డి నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ అధికారులు వివిధ కీలక పత్రాలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రంలోని మద్యం డిస్టిలరీలు అనధికార మార్గాల్లో వైసీపీ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర అని ఆరోపణలు ఉన్నాయి.

ఏపీ బెవరేజెస్‌ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం మూడు వాహనాల్లో వచ్చిన ఏపీ పోలీసులు నానక్‌రామ్‌గూడలోని వాసుదేవరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. జగన్‌ హయాంలో మద్యం దోపిడీని వాసుదేవ రెడ్డి నడిపించారని ఆరోపణలు రావడంతో ఏపీ పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు కొనసాగించారు. వైసీపీకి లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు రావడంతో ఏపీ పోలీసులు రంగంలోకి దిగారు. ఏపీలో డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో కూడా వాసుదేవ హస్తముందని ఆరోపణలు ఉన్నాయి.

Updated On 7 Jun 2024 3:57 AM GMT
Yagnik

Yagnik

Next Story