ఏపీలో(andhra Pradesh) కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం విధానా(Liqours policy)న్ని అమలులోకి తీసుకొచ్చింది.

ఏపీలో(andhra Pradesh) కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం విధానా(Liqours policy)న్ని అమలులోకి తీసుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం షాపులకు(Liquor shops) సంబంధించి ఎక్సైజ్ శాఖ లాటరీ పద్దతిలో(Lottery system) లైసెన్స్‌‏లు జారీ చేసింది, దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో కొత్త మద్యం షాపుల్లో అమ్మకాలు మొదలయ్యాయి.. దేశీయ మద్యం బ్రాండులతో పాటు విదేశీ మద్యం బ్రాండులను కూడా అందుబాటులో ఉండేలా ప్రభుతం నిర్ణయం తీసుకుంది.. ఎన్నికల సమయంలో కూటమి సర్కార్ ఏదైతే హామీ ఇచ్చిందో దానికి అనుగుణంగానే ప్రస్తుతం మద్యం దుకాణాలు నడుస్తున్నాయి.

రాష్టంలో కొత్త మద్యం దుకాణాల టెండర్ల సమయంలో తీవ్ర పోటీ నెలకొంది. షాపులను దక్కించేందుకు చాలామంది పోటీపడ్డారు, ఈ టెండర్లలో ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం పాల్గొన్నారు.. ఎవరైతే టెండర్లు గెలుచుకున్నారో వారిపై ఎమ్మెల్యేల దగ్గర నుంచి తీవ్రంగా ఒత్తిడి వస్తుంది.. లైసెన్సులు దక్కించుకున్నవారు ఎమ్మెల్యేకి కమిషన్ ఇచ్చిన తరువాతే షాపులు ఓపెన్ చేయాలని ఒత్తిడి రావడంతో చాలామంది లైసెన్సులు ఉన్నా మద్యం దుకాణాలను తెరిచేందుకు బయపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,396 మద్యం దుకాణాలకు లైసెన్సులు(License) ఇచ్చారు అయితే వీటిలో కేవలం1950 మద్యం షాపులు మాత్రమే తెరిచి అమ్మకాలు జరుపుతున్నారు. మిగతా 1400 షాపుల్లో మద్యం అమ్మకాలు జరగడం లేదు.. లైసెన్సులు ఉన్నా ఎమ్మెల్యేల భయంతో షాపులు తెరవాలంటే భయపడుతున్నారు , లక్షలు పోసి లాటరీలో షాపులను దక్కించుకున్నా ఎమ్మెల్యేలకు కమిషన్(MLA Commission) ఇస్తేనే తెరవాలన్న రూల్‏తో షాపు ఓనర్లు అయోమయంలో పడ్డారు.. ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకొని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.. లేకపోతే తమ లైసెన్సులను తిరిగిచేస్తాం ప్రభుత్వం తీసుకున్న డబ్బులను తిరిగి చెల్లించాలని షాపు యజమానులు డిమాండ్ చేస్తున్నారు . లెసెన్సులు వచ్చి 20 రోజులు అవుతున్నా ఇప్పటివరకు షాపులు తెరవలేదని.. దాని వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

ఇది ఇలా ఉంటే రాష్టంలోని చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే మద్యం దుకాణాలు నడుస్తున్నాయి.. ఎంఆర్పీ ధరలకంటే ఎక్కువకి మద్యం అమ్ముతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు, ఇదేమిటి అని ప్రశ్నిస్తే ఇది ఎమ్మెల్యే గారి షాపు అని బెదిరిస్తున్నారు.. ఎంఆర్పీ ధరలకంటే ఎక్కువకి అమ్మకూడదని ప్రభుత్వం చెప్పినా ఆ రూల్స్‏ని ఎవరూ పాటించడం లేదు. ఎక్సైజ్ అధికారులు కూడా చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు చెప్పినట్టే వింటున్నారు.

ఎమ్మెల్యేల తీరుపై ఇటు ప్రజల్లోనూ, యజమానుల్లోను అసహనం వ్యక్తమవుతుంది..ఇలా ప్రతి దానికి కమీషన్లు ఇచ్చేకంటే ఒక కొత్త జివో తీసుకొచ్చి మద్యం షాపులను కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే నడిపేటట్టు అసెంబ్లీలోనే తీర్మానం చేస్తే ఎలాంటి గొడవలు ఉండవని.. ఇక ఎమ్మెల్యేలకు కమీషన్లు కట్టే బాధ కూడా తప్పుతుందని ఓనర్లు అంటున్నారు.. ఒక్క మద్యమే కాకుండా ప్రభుత్వానికి సంబంధించి ప్రవేటుపరంగా నడిచే చాలా వ్యవస్థలపై ఎమ్మెల్యేల పెత్తనం ఎక్కువైందని అలాంటి వాటన్నిటిని ప్రజా ప్రతినిధులే నడుపుకునేలా ఒక చట్టం తీసుకొస్తే ఇలాంటి కమిషన్ల బాధలు తప్పుతాయని వాపోతున్నారు.

Eha Tv

Eha Tv

Next Story