Gidugu Rudra Raju : మెడికల్ సీట్లతో వ్యాపారం చేయడం దుర్మార్గం
జగన్(YS Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య ను వ్యాపారంగా మార్చారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు(Gidugu Rudra Raju) ఆరోపించారు. 107, 108 జీవోల ప్రకారం మెడికల్ కాలేజీల్లో ఫీజులను మార్చేశారని అన్నారు. ఐదు మెడికల్ కళాశాల్లో 750 సీట్లు ఉన్నాయి. 638 సీట్లలో బీసీలకు 28, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనారిటీలకు 4శాతం ఉండాలి.
జగన్(YS Jagan) అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య ను వ్యాపారంగా మార్చారని ఏపీ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు(Gidugu Rudra Raju) ఆరోపించారు. 107, 108 జీవోల ప్రకారం మెడికల్ కాలేజీల్లో ఫీజులను మార్చేశారని అన్నారు. ఐదు మెడికల్ కళాశాల్లో 750 సీట్లు ఉన్నాయి. 638 సీట్లలో బీసీలకు 28, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 6 శాతం, మైనారిటీలకు 4శాతం ఉండాలి. ఇప్పుడు ఉన్న జీవోల ప్రకారం.. 638లో యాభై శాతం 319 సీట్లను సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో అమ్మకానికి పెట్టారని ఆరోపించారు. లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ ఉంటే.. ఈ విధంగా ఫీజులు వసూలు చేయడం అన్యాయం అన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలకు జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వైద్యుల కొరత ఉంది. మెడికల్ సీట్లతో వ్యాపారం చేయడం దుర్మార్గం అన్నారు. మరో 12 మెడికల్ కాలేజీల్లో కూడా ఈ జీవోలను అమల్లోకి తెస్తే.. విద్యార్దులు నష్టపోతారని.. 107, 108 జీవోను రద్దు చేయాలని సీఎం కు బహిరంగ లేఖ రాశామని వెల్లడించారు.