YS Sharmila : ఎవరినీ ప్రశాంతంగా బ్రతకనివ్వరా..? ప్రధాని సమాధానం చెప్పాలి
రాహుల్ గాంధీపై అస్సాంలో దాడికి ప్రయత్నించింనందుకు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం GVMC గాంధీ విగ్రహం వద్ద APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిరసన దీక్షలో పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై అస్సాం(Assam)లో దాడికి ప్రయత్నించింనందుకు ఏఐసీసీ(AICC) ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం GVMC గాంధీ విగ్రహం వద్ద APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి(YS Sharmila Reddy) నిరసన దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్, సీనియర్ నేతలు కేవీపీ, గిడుగు రుద్ర రాజు, రఘువీరా రెడ్డి(Raghuveera Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అస్సాం ఘటనపై రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి ప్రధాని మోదీ(PM Modi) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్ జోడో న్యాయ యాత్ర ఈ దేశ పౌరుల హక్కుల కోసం పోరాడే యాత్ర అని ఆమె పేర్కొన్నారు. అస్సాంలో రాహుల్ గాంధీ పై దాడి చేయాలని చూశారని.. ప్రమాదం తలపెట్టాలని బీజేపీ గూండాలు ప్రయత్నం చేశారని ఆరోపించారు.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ప్రశాంతంగా యాత్ర చేసుకొనే పరిస్థితి లేదన్నారు. ప్రజాస్వామ్యం ఉన్నట్లా లేనట్లా మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ దేశం అందరిదీ కాదా..? కేవలం బీజేపీ, RSS కార్యకర్తలే ఉండాలా..? మిగతా ఎవరిని ప్రశాంతంగా బ్రతకనివ్వరా..? ప్రధాని దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
రాహుల్ గాంధీని కనీసం గుడికి కూడా వెళ్లనీయలేదన్నారు. అయోధ్యలో రామ మందిరానికి.. అస్సాంలో రాహుల్ గుడికి వెళ్ళనీయక పోవడానికి సంబంధం లేదా.? రాహుల్ ను ఎందుకు ఆలయంలో అనుమతి ఇవ్వలేదో చెప్పాలన్నారు. మోదీతో పాటు అస్సాం ముఖ్యమంత్రి కూడా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ పాలన ప్రజాస్వామ్యం అని ఎలా అనుకోవాలన్నారు. మోడీ నిరంకుశ పాలన ఆగాలి.. ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. మీ నిరంకుశ పాలన ఆపకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాహుల్ యాత్రను అడ్డుకోవడానికి చూసినందుకు ప్రధాని క్షమాపణ చెప్పాలన్నారు.