Andhra Pradesh : నవీ ముంబై లో ఏపీ మంత్రి బృందం పర్యటన
అమరావతి నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చెందిన ఆధునిక నగరాల నిర్మాణాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలోని బృందం నవీ ముంబైలో పర్యటించింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం వేగవంతం చేయాలని నిర్ణయించింది. తాజాగా రాజధాని నిర్మాణంలో 2019 కు ముందు ఉన్న మాస్టర్ ప్లాన్ ప్రకారమే ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతి నిర్మాణంలో భాగంగా అభివృద్ధి చెందిన ఆధునిక నగరాల నిర్మాణాల్లో అనుసరించిన విధానాలను అధ్యయనం చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలోని బృందం నవీ ముంబైలో పర్యటించింది. పర్యటనలో భాగంగా మంత్రి నారాయణతో పాటు సీఆర్డీయే కమిషనర్ కాటంనేని భాస్కర్, అదనపు కమిషనర్లు నవీన్, సూర్య సాయి ప్రవీణ్ చంద్ లు ఈ పర్యటన కు వెళ్లారు. సిడ్కో అధికారులతో మంత్రి బృందం సమావేశమైంది.
నవీ ముంబై నిర్మాణంలో మహారాష్ట్ర ప్రభుత్వ సంస్థగా ఉన్న సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(CIDCO) ముఖ్య భూమిక పోషిస్తుంది. నవీ ముంబై నగర ప్రణాళికలు, అభివృద్ధిలో సిడ్కో పాత్ర చాలా కీలకమైనది.
మంత్రి నారాయణ బృందం నవీ ముంబై లో రోడ్ నెట్ వర్క్, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులపై అధ్యయనం చేసింది. సిడ్కో అధికారులతో కలిసి నవీ ముంబై లో మంత్రి నారాయణ బృందం పర్యటించింది. నవీ ముంబై ఎయిర్ పోర్ట్ ప్రభావిత నోటిఫైడ్ ఏరియా లో పర్యటించింది మంత్రి బృందం.. అక్కడి హౌసింగ్ స్కీమ్స్, ఆర్థిక ప్రణాళికలు, అభివృద్ధి ప్రణాళికలు గురించి సిడ్కో అధికారులు వివరించారు. నవీ ముంబై అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సిడ్కో అధికారులు.