Buggana Rajendranath Reddy : ఎమ్మెల్యేల సమావేశానికి బుగ్గన డుమ్మా.. కారణమేమిటి..?
దేశంలో కరోనా వైరస్(Corona Virus) నెమ్మదిగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల(Telugu States)లో కూడా కరోనా అలజడి మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy)కి కూడా కరోనా సోకింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు(YSRCP MLAs), సమన్వయకర్తలు, ఇన్‌ఛార్జ్‌ల సమావేశానికి బుగ్గన రాకపోవడానికి కారణం అదే! ఇప్పటికే కరోనా వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం(Central Govt) అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.

Buggana Rajendranath Reddy
దేశంలో కరోనా వైరస్(Corona Virus) నెమ్మదిగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల(Telugu States)లో కూడా కరోనా అలజడి మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy)కి కూడా కరోనా సోకింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు(YSRCP MLAs), సమన్వయకర్తలు, ఇన్‌ఛార్జ్‌ల సమావేశానికి బుగ్గన రాకపోవడానికి కారణం అదే! ఇప్పటికే కరోనా వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం(Central Govt) అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. కరోనా జాడలు లేవన్న ధీమాతో కేర్‌లెస్‌గా ఉంటున్నాం. కరోనాపై ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నాలుగో వేవ్ పొంచి ఉన్నదని డాక్టర్లు చెబతున్నారు.. కరోనా రెండో వేవ్‌లో ఎంతో మంది చనిపోయారు. ఆసుపత్రుల్లో బెడ్లు దొరకక అవస్థలు పడ్డారు పేషంట్లు. ఆక్సిజన్ అందక అల్లాడిపోయారు. లాక్‌డౌన్‌లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. కోట్లాది మందికి ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారు. ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వారు కూడా లెక్కలేనంత మంది న్నారు. కరోనా కారణంగా కుటుంబాలకు కుటుంబాలే చెల్లాచెదురయ్యాయ. ఆత్మీయుల చివరి చూపులు దక్కలేదు. అంత్యక్రియలను కూడా నిర్వహించలేని నిస్సహాయ స్థితిలోకి చేరుకున్నారు జనం. ఇవన్ని మన కళ్ల ముందు జరిగిన సంఘటనలు. అంచేత రానున్న ముప్పు నుంచి బయటపడదాం. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుందాం!
