AP State Meteorological Department : ఈ నెల 19 నుంచి వర్షాలు
ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఈ నెల 18 నుంచి 21 మధ్య ఋతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

AP Meteorological Department has made an announcement that there will be rains from 19th of this month
ఈ నెల 19 నుంచి వర్షాలు(Rains) ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ(AP State Meteorological Department) కీలక ప్రకటన చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఈ నెల 18 నుంచి 21 మధ్య ఋతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 19 నుంచి తిరుపతి(Tirupathi), శ్రీ సత్యసాయి(Sristyasai), అన్నమయ్య(Annamayya), వైయస్సార్(YSR Kadapa), చిత్తూరు(Chittoore) జిల్లాలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్రలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ఇక అటు తెలంగాణ(Telangana) రాష్ట్రంలో కూడా ఈ నెల 19 నుంచి వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్(Hyderabad) వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది.
