Capital Issue : హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కోరుతున్న ఏపీ నేతలు.. మరి ప్రజలేమంటున్నారు.?
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. అయితే.. హైదరాబాద్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉండనుంది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగుందని పొందుపరిచిన నేపథ్యంలో ఆ గడువు నేటితో ముగియనుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్. అయితే.. హైదరాబాద్ ఈ ఒక్కరోజు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉండనుంది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగుందని పొందుపరిచిన నేపథ్యంలో ఆ గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో ఉమ్మడి రాజధానిని కొనసాగించాలని డిమాండ్లు వినపడుతున్నాయి.
10 ఏళ్లు దాటినా హైదరాబాద్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని రాజకీయ పార్టీలు వెంటనే లేవనెత్తాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీ నారాయణ అన్నారు.
అయితే ఆయన డిమాండ్‌ను పలువురు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో విమర్శించారు. “ప్రియమైన సార్.. ఇది ఆచరణ సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ తన సొంత రాజధానిని నిర్మించుకునే సమయం 10 సంవత్సరాల క్రితమే 2014లో వచ్చిందని X వినియోగదారు శచీంద్ర రాజవరం అన్నారు.
"అలా చేయడం అపరిపక్వమైనది.. మన స్వంత రాజధానిని నిర్మించుకుందామని ఫణి గోసాల అనే మరొక ఎక్స్ వినియోగదారుడు బదులిచ్చారు.
రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని పార్టీలకు అతీతంగా నేతలు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్‌ను మరో పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. నివేదికల ప్రకారం.. గత 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కు సరైన రాజధానిని నిర్మించడంలో విఫలమైనందున.. రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ హోదాను మరో 10 సంవత్సరాలు పొడిగించాలని ఆయన మే 23 న ఒక ప్రకటనలో కోరారు.
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఫిబ్రవరి 16న ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కు హోదాను అమరావతి నుండి విశాఖపట్నంకు మార్చే వరకు పొడిగించాలని కోరినట్లు తెలిసింది.