AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పటి నుండి అంటే!!
ఫస్టియర్ ఫలితాల్లో మొదటి స్థానం సాధించిన కృష్ణా జిల్లాలో 84 శాతం ఉత్తీర్ణత ఉంది
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి సౌరభ్‌గౌర్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫలితాల్లో ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 67 శాతం ఉత్తీర్ణత శాతం వచ్చింది.సెకండ్ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది. రెండో స్థానంలో గుంటూరు నిలిచింది. మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది.
ఫస్టియర్ ఫలితాల్లో మొదటి స్థానం సాధించిన కృష్ణా జిల్లాలో 84 శాతం ఉత్తీర్ణత ఉంది. రెండో స్థానంలో గుంటూరు జిల్లా 81 శాతం సాధించింది. మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా 79 శాతంలో నిలిచింది. ఇంటర్ సెకండయిర్ ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిచిన కృష్ణా జిల్లాలో 90 శాతం ఉత్తీర్ణత వచ్చింది. రెండో స్థానంలో నిలిచిన గుంటూరు జిల్లాలో 87 శాతం ఉంది. ఈనెల 18 నుంచి 24 వరకు రీవాల్యూయేషన్‌కు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం ఏప్రిల్ 18 నుంచి 24 ఫీజు చెల్లించవచ్చు. సప్లిమెంటరీ, ఇంప్రూమెంట్ విద్యార్థులకు మే 24 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఏప్రిల్ 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించవచ్చు.