ఆంధ్రప్రదేశ్ లో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ ఫ‌లితాలు నేడు వెలువడనున్నాయి

ఆంధ్రప్రదేశ్ లో ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ ఫ‌లితాలు నేడు వెలువడనున్నాయి. ఫలితాలు శుక్ర‌వారం విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఏపీ ఇంటర్ బోర్డు వెల్ల‌డించింది. మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేస్తామ‌ని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యామండ‌లి ప్ర‌క‌టించింది. తాడేప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యా కార్యాల‌యంలో ఉద‌యం 11 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఏపీలో ఇంటర్ పరీక్షలు మార్చి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు జరిగాయి. ఒకేష‌న‌ల్‌, రెగ్యుల‌ర్ కలిపి మొదటి సంవత్సరం.. 5,17,617 మంది విద్యార్థులు, సెకండియర్ 5,35,056 మంది విద్యార్థులు పరీక్షలకు ఫీజులు చెల్లించారు.

ఫ‌లితాల‌ను ఇంట‌ర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://resultsbie.ap.gov.in లో పొంద‌వ‌చ్చు. AP 2023 ఇంటర్ ఫలితాల గ్రేడింగ్ విధానం ఈ విధంగా ఉంది:
గ్రేడ్ A: 75% పైన
గ్రేడ్ B: ​​60% నుండి 75%
గ్రేడ్ సి: 50% నుండి 60%
గ్రేడ్ D: 35% నుండి 50%

మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించని వారికి, ఇంట‌ర్ బోర్డు 1వ, 2వ సంవత్సరం విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తుంది. సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ బోర్డు ఫలితాల తర్వాత ప్రకటిస్తారు.

Updated On 11 April 2024 9:41 PM GMT
Yagnik

Yagnik

Next Story