Chandrababu Bail : నేడు చంద్రబాబు బెయిల్‌పై తీర్పు
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) బెయిల్పిటీషన్‌పై(Bail Petition) ఏపీ హైకోర్టు(AP High Court) నేడు తీర్పు చెప్పనుంది. స్కిల్ స్కామ్ కేసులో(Skill Scam Case) తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్‌పై ఇప్పటికే హైకోర్టులో విచారణ పూర్తైంది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్(Reserve) చేసింది. ఈ మేరకు తీర్పు ఈరోజు వస్తుందని జాబితాలో పేర్కొనడంతో టీడీపీ శ్రేణుల్లో టెన్షన్ నెలకొంది.

ఇదిలావుంటే.. స్కిల్ కేసులో 52 రోజుల పాటు రాజమండ్రిలో(Rajahmundry) రిమాండ్(Remand) ఖైదీగా ఉన్న చంద్రబాబుకు కంటి ఆపరేషన్ నిమిత్తం కోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్(Interim Bail) మంజూరు చేసింది. ఈ నెల 28న ఆయన బెయిల్ గడువు ముగియనుండటంతో.. రాజమండ్రి జైలులో లొంగిపోవాల్సివుంది. మధ్యంతర బెయిల్ గడువు ముగియనుండటంతో ఈ రోజు హైకోర్టు తీర్పు ఎలా వస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కంటికి శస్త్ర చికిత్స చేయించుకున్న చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు.