AP high Court : ప్రతిపక్ష హోదాపై జగన్ పిటిషన్....స్పీకర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు!
ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS jagan Mohan reddy) వేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP high Court) విచారణ జరిపింది.
ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS jagan Mohan reddy) వేసిన పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు(AP high Court) విచారణ జరిపింది. కక్ష పూరితంగా ప్రతిపక్ష నేతహోదా ఇవ్వడం లేదని జగన్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రతిపక్ష నేతగా గుర్తించాలని స్పీకర్‌కు జగన్ రిప్రజెంటేషన్ ఇచ్చారా అని జడ్జి అడిగిన ప్రశ్నకు , గత నెల 24వ తేదీనే ఇచ్చారని జగన్ తరఫున న్యాయవాది సమాధానం చెప్పారు. అసెంబ్లీ సెక్రటరీ, స్పీకర్ కార్యదర్శికి కోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ మూడు వారాలకు విచారణను కోర్టు వాయిదా వేసింది.
మరోవైపు ప్రతిపక్ష హోదా అనేది డిమాండ్ చేస్తే వచ్చేది కాదంటున్నారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా పది శాతం స్థానాలు రాకపోతే హోదా రాదన్నారాయన! ప్రజల పక్షాన పోరాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని జగన్‌కు సలహా ఇచ్చారు. పార్లమెంటరీ సాంప్రదాయాల విషయంలో కోర్టు జోక్యం చేసుకుంటుందని తాను అనుకోవడం లేదని జీవీఎల్ చెప్పారు. రాష్ట్రపతి పాలన పెట్టాలనేది రాజకీయ ఎత్తుగడ తప్ప దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు జీవీఎల్ నరసింహారావు.